Nara Lokesh: కొడుక్కి కారుంటే తల్లికి పెన్షన్ తీసేస్తావా?: నారా లోకేశ్

  • తెలంగాణలో ఉన్న కొడుక్కి కారుంటే ఇక్కడ తల్లికి పెన్షన్ తీసేశారంటూ లోకేశ్ మండిపాటు
  • 10 నెలల కిందట పెన్షన్ తొలగించారని ఆగ్రహం
  • ఏ1 తీసుకొచ్చిన జీవో 1ని హైకోర్టు తొలగించిందని వ్యాఖ్య
Nara Lokesh fires on Jagan

ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ యువనేత నారా లోకేశ్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కొడుక్కి కారుంటే తల్లికి పెన్షన్ తీసేస్తావా తుగ్లక్ అంటూ మండిపడ్డారు. నందికొట్కూరు నియోజకవర్గం తుమ్ములూరుకు చెందిన ఈ తల్లి ఒక బాధితురాలని, ఈమెకు 10 నెలల క్రితం పెన్షన్ తీసేశారని చెప్పారు. కారణమేంటని అడిగితే ఎక్కడో తెలంగాణలో ఉంటున్న కొడుక్కి కారు ఉందట, బిడ్డకు ఫోర్ వీలర్ ఉంది కాబట్టి తల్లికి పెన్షన్ పీకేశారంట అని ఎద్దేవా చేశారు. 

ఫిటింగ్ మాస్టర్ జగన్ కు ఈ సందర్భంగా తాను ఒక సూటి ప్రశ్న వేస్తున్నానని... బాత్రూమ్ లో బాబాయిని లేపేసిన కేసులో రేపో, మాపో నీ ముద్దుల తమ్ముడు జైలుకు పోతాడని, అందుకు కారణం నువ్వే కాబట్టి సీఎం పదవి వదిలేసి జైలుకి పోతావా తుగ్లక్ రెడ్డీ? అని ప్రశ్నించారు. 

ఏ1 తీసుకొచ్చిన జీవో 1ని హైకోర్టు కొట్టేసిందని... ఫ్యాక్షన్ పాలనపై ప్రజాస్వామ్యం గెలిచిందని లోకేశ్ అన్నారు. రాజారెడ్డి రాజ్యాంగం ఇక చెల్లదంటూ అంబేద్కర్ రాజ్యాంగం నిరూపించిందని చెప్పారు.

More Telugu News