TDP Mahanadu: మహానాడు ప్రాంగణానికి భూమిపూజ

  • గోదావరి తీరాన ఏర్పాట్లకు శ్రీకారం చుట్టిన అచ్చెన్నాయుడు
  • రాజమహేంద్రవరం వేదికగా జగన్ పాలనకు చరమగీతం పాడుతామని వెల్లడి
  • మరుసటి రోజు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమం
  • లక్షలాదిగా తరలిరావాలంటూ ప్రజలకు దేవినేని పిలుపు 
Mahanadu preparations started in Rajamahendravarm by tdp state chief acham naidu

తెలుగుదేశం పార్టీ మహానాడుకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. రాజమహేంద్రవరంలోని గోదావరి తీరంలో మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించాలని పార్టీ ఇప్పటికే నిర్ణయించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం మహానాడు ఏర్పాట్లకు శ్రీకారం చుడుతూ.. పార్టీ ఏపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమానికి పార్టీలోని సీనియర్ నేతలంతా తరలి వచ్చారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ఈ ఏడాది మహానాడు అత్యంత ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు.

ఈ నెల 27న 15 వేల మంది ప్రతినిధులతో మహానాడు, మరుసటి రోజు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమాన్ని 15 లక్షల మందితో నిర్వహిస్తామని చెప్పారు. మహానాడు తొలిరోజు ప్రతినిధుల సభలో వైసీపీ పాలనకు వ్యతిరేకంగా 15 తీర్మానాలు ప్రవేశపెడతామని తెలిపారు. మహానాడు కోసం టీడీపీ నేతలు సిద్ధమవుతుండగా.. వైసీపీ మాత్రం కవ్వింపు చర్యలకు దిగుతోందని అచ్చెన్నాయుడు ఆరోపించారు. సిటీతో పాటు శివారు ప్రాంతాలలో టీడీపీ హోర్డింగ్ లు ఏర్పాటు చేయకుండా ఎంపీ మార్గాని భరత్ ఆటంకాలు సృష్టిస్తున్నారని చెప్పారు. 

హోర్డింగులన్నీ ఆయన బ్లాక్ చేశారని వివరించారు. కవ్వింపు చర్యలు ఆపకుంటే ప్రజలు వైసీపీపై తిరగబడతారని హెచ్చరించారు. పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు మాట్లాడుతూ.. తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ఎన్టీఆర్ ఢిల్లీకి చాటిచెబితే, జగన్ మాత్రం ఢిల్లీ పెద్దల కాళ్లపైన పడి తెలుగువారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నాడని మండిపడ్డారు. జగన్ పాలన పోవాలి.. మళ్లీ చంద్రబాబు పాలన రావాలి అని రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు.

రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ... భారతదేశ చరిత్రలోనే మహానాడు ఒక అపూర్వ అధ్యాయం అని అభివర్ణించారు. మహానాడు ఆతిథ్యానికి సిద్ధంగా ఉన్నామని, గోదావరి పుష్కరాలకు వచ్చిన అతిధులను ఆదరించిన మాదిరి అందరినీ ఆదరిస్తామని తెలిపారు. పెద్దాపురం ఎమ్మెల్యే, పొలిట్ బ్యూరో సభ్యుడు నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ.. మహానాడు కార్యకర్తల పండుగ అని, మహానాడు, ఎన్టీఆర్ వందవ పుట్టిన రోజు వైభవంగా నిర్వహించేందుకు ఉభయగోదావరి జిల్లాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ... పవిత్ర గోదావరి తీరం మహానాడుకు సిద్ధమవుతోందని, లక్షలాదిగా తరలి వచ్చి విజయవంతం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న నేతలు..
టీడీపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు, రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, సిటీ ఎమ్మెల్యే శ్రీమతి ఆదిరెడ్డి భవానీ, ఎమ్మెల్సీలు దువ్వారపు రామారావు, పి. అశోక్ బాబు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు నిమ్మకాయల చినరాజప్ప, చింతకాయల అయ్యన్నపాత్రుడు, కొల్లు రవీంద్ర, దేవినేని ఉమామహేశ్వరరావు, బీదా రవిచంద్ర యాదవ్, టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి బొండా ఉమామహేశ్వరరావు, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ, గొల్లపల్లి సూర్యారావు, శాసనమండలి మాజీ డిప్యూటీ ఛైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కె.ఎస్.జవహర్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, కాకినాడ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్, అమలాపురం పార్లమెంట్ టీడీపీ ఇంఛార్జి గంటి హరీష్ బాలయోగి, తెలంగాణ తెలుగుయువత అధ్యక్షుడు పొగాకు జయరాం చందర్, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శిష్ట్లా లోహిత్, మాజీ ఎమ్మెల్యేలు పెందుర్తి వెంకటేష్, బూరుగుపల్లి శేషారావు, ఎస్.వి.ఎస్.ఎన్.వర్మ, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, దాట్ల బుచ్చిబాబు, పిల్లి అనంతలక్ష్మి, టీడీపీ నాయకులు దామచర్ల సత్య, చెల్లుబోయిన శ్రీనివాస్, కుడుపూడి సత్తిబాబు, వీరవల్లి శ్రీనివాస్, ఎంవిఎస్ చౌదరి, నామన రాంబాబు, డొక్కా నాధబాబు,  గన్ని కృష్ణ, కాశి నవీన్ కుమార్, తెలుగు మహిళ నాయకులు మజ్జి పద్మ, యార్లగడ్డ సుచిత్ర, భీమనేని వందనాదేవి, సత్యవాణి, టి.ఎన్.టి.యు.సి. అధ్యక్షుడు గొట్టుముక్కల రఘురామరాజు తదితరులు ఈ భూమిపూజ కార్యక్రమంలో పాల్గొన్నారు.

More Telugu News