Aishwarya Lakshmi: టీనేజ్ లో క్రికెటర్ తో లవ్ లో పడ్డా: హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి

I loved Yuvaraj Singh when I was a teenager says actress Aishwarya Lakshmi
  • వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న ఐశ్వర్య లక్ష్మి
  • తెలుగు ప్రేక్షకులను కూడా మెప్పించిన మలయాళ బ్యూటీ
  • అప్పట్లో యువరాజ్ సింగ్ అంటే తనకు పిచ్చి అని చెప్పిన ఐశ్వర్య
మలయాళ భామ ఐశ్వర్య లక్ష్మి తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. డాక్టర్ వృత్తి నుంచి యాక్టర్ గా మారిన 32 ఏళ్ల ఐశ్వర్య పలు చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. టాలీవుడ్ లో 'గాడ్సే', 'అమ్ము' తదితర చిత్రాల్లో నటించింది. ప్రముఖ సినీ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన 'పొన్నియన్ సెల్వన్' సినిమాలో కూడా ఐశ్వర్య మెరిసింది. ప్రస్తుతం ఆమెకు దక్షిణాదిలో వరుస ఆఫర్లు వస్తున్నాయి. మరోవైపు ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 

యువ నటుడు అర్జున్ దాస్ కు, తనకు మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందనే వార్తల్లో నిజం లేదని ఐశ్వర్య తెలిపింది. ఇద్దరూ క్లోజ్ గా ఉన్న ఫొటోలను వీరు సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో, ఇద్దరి మధ్య ఏదో ఉందనే ప్రచారం ఊపందుకుంది. అయితే, తాము మంచి స్నేహితులం మాత్రమేనని, అంతకు మించి తమ మధ్య మరేమీ లేదని స్పష్టం చేసింది. అయితే తాను టీనేజ్ లో ఉండగా టీమిండియా క్రికెటర్ యువరాజ్ సింగ్ తో ప్రేమలో పడ్డానని వెల్లడించింది. యువీ అంటే తనకు పిచ్చి అని... తన మనసులోనే ఆయనను ప్రేమించేదాన్నని చెప్పింది.
Aishwarya Lakshmi
Tollywood
Yuvaraj Singh
Love

More Telugu News