Pawan Kalyan: రెండు రోజులు కనపడటం, ఆ తర్వాత డెన్ లోకి వెళ్లడం ఇద్దరికీ అలవాటే: కాకాణి గోవర్ధన్

Chandrababu and Pawan Kalyan are political tourists says
  • చంద్రబాబు కోసమే పవన్ పని చేస్తున్నారన్న కాకాని
  • ఉనికిని కాపాడుకునేందుకు రైతులపై ఎనలేని ప్రేమను చూపిస్తున్నారని విమర్శ
  • ఇద్దరూ పొలిటికల్ టూరిస్టులని ఎద్దేవా
రాష్ట్ర ప్రయోజనాల కోసం పొత్తు పెట్టుకుంటామంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. దీంతో, టీడీపీ, జనసేనలు కలిసే పోటీ చేసే అవకాశం ఉందంటూ కొంత కాలంగా జరుగుతున్న ప్రచారం విషయంలో క్లారిటీ వచ్చినట్టయింది. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబులపై మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. 

చంద్రబాబు కోసమే పవన్ పని చేస్తున్నారనే విషయం అర్థమయిందని కాకాణి చెప్పారు. వారి ఉనికిని కాపాడుకునేందుకు పవన్, చంద్రబాబులు రైతులపై ఎనలేని ప్రేమను చూపిస్తున్నారని అన్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో రైతులకు ఏం చేశారో ఇప్పటి వరకు చంద్రబాబు, పవన్ చెప్పలేకపోతున్నారని విమర్శించారు. 

వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారని చెప్పారు. చంద్రబాబు, పవన్ ఇద్దరూ పొలిటికల్ టూరిస్టులని... కొన్ని రోజులు కనపడటం, ఆ తర్వాత డెన్ లోకి వెళ్లడం ఇద్దరికీ అలవాటేనని ఎద్దేవా చేశారు. ఉభయగోదావరి జిల్లాలలో తిరుగుతూ పవన్ హడావుడి చేస్తున్నారని దుయ్యబట్టారు.
Pawan Kalyan
Janasena
Kakani Govardhan Reddy
YSRCP
Chandrababu
Telugudesam

More Telugu News