ఏపీలో భిన్న వాతావరణం.. మూడు రోజులపాటు వర్షాలు.. అదే సమయంలో ఠారెత్తించనున్న ఎండలు!
- వర్షాలకు తోడు ఉష్ణోగ్రతల్లోనూ పెరుగుదల
- 60 మండలాల్లో నేడు వడగాల్పులు
- ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు
- ఈ నెల 14న తీరం దాటనున్న ‘మోఖా’ తుపాను
మోఖా తుపాను ఈ నెల 14న ఆగ్నేయ బంగ్లాదేశ్, ఉత్తర మయన్మార్ మధ్యలో కాక్స్ బజార్ వద్ద తీరం దాటే అవకాశం ఉంది. ఉత్తర ఈశాన్య దిశగా కదిలిన ‘మోఖా’ గత రాత్రి తీవ్ర తుపానుగా మారింది. నేడు మధ్య బంగాళాఖాతంలో అత్యంత తీవ్ర తుపానుగా బలపడే అవకాశం ఉంది. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 175 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.