marriage: తనయుడు సహా 25 పేద జంటలకు సామూహిక వివాహాలు జరిపించిన మహారాష్ట్ర ఎమ్మెల్యే

BJP MLAs son among 25 couples who tie knot at mass marriage in Maharashtras Latur
  • లాతూర్ జిల్లా ఉటేజ్ గ్రౌండ్ లో పెళ్లి జరిపించిన ఎమ్మెల్యే అభిమన్యు పవార్
  • ముఖ్య అతిథిగా హాజరైన సీఎం ఏక్ నాథ్ షిండే 
  • ఇతర నాయకులు కూడా చొరవ చూపాలన్న సీఎం
మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలో ఓ బీజేపీ ఎమ్మెల్యే తన కొడుకుతో పాటు 25 పేద జంటలకు సామూహిక వివాహం జరిపించారు. ఉటేజ్ గ్రౌండ్ లో బుధవారం సాయంత్రం ఔసా ఎమ్మెల్యే అభిమన్యు పవార్ ఈ సామూహిక వివాహాన్ని జరిపించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత అజిత్ పవార్, కేంద్రమంత్రి రావుసాహెబ్ దాన్వే సహా పలువురు హాజరై, దంపతులను ఆశీర్వదించారు. నిరుపేదల కోసం సామూహిక వివాహ వేడుకను నిర్వహించడానికి బీజేపీ ఎమ్మెల్యే కృషిని సీఎం షిండేను అభినందించారు. ఇతర నాయకులు కూడా ఇదే తరహాలో చొరవ చూపాలని సూచించారు.
marriage
BJP

More Telugu News