RR: నువ్వా, నేనా... అమీతుమీకి సిద్ధమైన కోల్ కతా, రాజస్థాన్ రాయల్స్

  • కీలక దశకు చేరిన ఐపీఎల్
  • ప్లే ఆఫ్ పై కన్నేసిన పలు జట్లు
  • ఇకపై ఒక్క మ్యాచ్ లో ఓడినా ప్లే ఆఫ్ అవకాశాలపై తీవ్ర ప్రభావం
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్
  • కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ లో మ్యాచ్
KKR will take off Rajasthan Royals today

ఐపీఎల్ లో కొన్ని జట్లకు ఇక ప్రతి మ్యాచ్ కీలకమే. ప్లే ఆఫ్ దశకు చేరేందుకు ఆయా జట్లకు అవకాశాలు కనిపిస్తుండడమే అందుకు కారణం. ఇకపై ఒక్క మ్యాచ్ లో ఓడినా ప్లే ఆఫ్ అవకాశాలపై తీవ్ర ప్రభావం పడనుంది. 

లీగ్ లో ఇవాళ రాజస్థాన్ రాయల్స్, కోల్ కతా నైట్ రైడర్స్ అమీతుమీకి సిద్ధమయ్యాయి. ఈ మ్యాచ్ కు కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా నిలుస్తోంది. టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ ఎంచుకుంది. 

ఈ మ్యాచ్ కోసం కోల్ కతా జట్టులో ఒక మార్పు చేసినట్టు కెప్టెన్ నితీశ్ రాణా వెల్లడించాడు. వైభవ్ అరోరా స్థానంలో అనుకూల్ రాయల్ ఆడనున్నాడు. ఇక రాజస్థాన్ జట్టులో రెండు మార్పులు జరిగాయి. కుల్దీప్ యాదవ్ స్థానంలో ట్రెంట్ బౌల్ట్, మురుగన్ అశ్విన్ స్థానంలో కేఎం ఆసిఫ్ ఆడనున్నారని రాజస్థాన్ రాయల్స్ సారథి సంజూ శాంసన్ తెలిపాడు. ఈ మ్యాచ్ లో ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు జో రూట్ 4వ స్థానంలో బ్యాటింగ్ కు వస్తాడని వివరించాడు. 

పాయింట్ల పట్టికలో రాజస్థాన్ రాయల్స్ 5వ స్థానంలో ఉండగా, కోల్ కతా 6వ స్థానంలో ఉంది. ఇరు జట్లు చెరో 11 మ్యాచ్ లు ఆడి ఐదేసి విజయాలు నమోదు చేశాయి.

More Telugu News