Imran Khan: ఇమ్రాన్ ఖాన్ విడుదలకు పాక్ సుప్రీంకోర్టు ఆదేశాలు

Imran Khans arrest illegal says Pakistans Supreme Court
  • ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ చట్ట విరుద్ధమన్న న్యాయస్థానం
  • ఆల్ ఖదీర్ ట్రస్ట్ కేసులో ఇమ్రాన్ ను అరెస్ట్ చేసిన ఆర్మీ రేంజర్లు
  • నేడు సుప్రీంకోర్టులో ప్రవేశపెట్టిన అధికారులు
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ చట్టవిరుద్ధమని ఆ దేశ సుప్రీంకోర్టు పేర్కొంది. ఆల్ ఖదీర్ ట్రస్ట్ కేసులో మంగళవారం ఆర్మీ రేంజర్లు అతన్ని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇమ్రాన్ ఖాన్ ను న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది.

ఇమ్రాన్ అరెస్ట్ చట్ట విరుద్ధమని తెలిపింది. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను తమ కస్టడీ నుంచి విడుదల చేయాలని అత్యున్నత న్యాయస్థానం గురువారం అక్రమాస్తుల నిరోధక సంస్థను ఆదేశించింది.
Imran Khan
Supreme Court

More Telugu News