Jagan: ప్రత్యేక విమానంలో విశాఖ బయలుదేరిన సీఎం జగన్

  • నేడు విశాఖలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న సీఎం జగన్
  • తొలుత వైఎస్సార్ విగ్రహం ఆవిష్కరణ
  • విశాఖ అపోలో ఆసుపత్రిలో క్యాన్సర్ విభాగానికి ప్రారంభోత్సవం
  • ఎమ్మెల్యే గొల్ల బాబూరావు కుమారుడి పెళ్లి రిసెప్షన్ కు హాజరు
CM Jagan takes off to Vizag

ఏపీ సీఎం జగన్ నేడు విశాఖపట్నంలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. కొద్దిసేపటి కిందట తాడేపల్లి నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న సీఎం ప్రత్యేక విమానంలో విశాఖ బయల్దేరారు. 

విశాఖలో సాయంత్రం 3.50 గంటలకు పీఎం పాలెం వైఎస్సార్ స్టేడియం వద్దకు చేరుకుని, అక్కడ వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం, 4.50 గంటలకు నగరంలోని అపోలో ఆసుపత్రిలో క్యాన్సర్ విభాగాన్ని ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో సీఎం ప్రసంగం ఉంటుంది. 

సాయంత్రం 5.50 గంటలకు బీచ్ రోడ్డు వద్ద సీ హ్యారియర్ యుద్ధ విమాన మ్యూజియంను ప్రారంభిస్తారు. ఇక్కడి నుంచే రామ్ నగర్ లోని వీఎంఆర్డీఏ కాంప్లెక్స్, ఎంవీపీలోని ఇండోర్ స్టోర్స్ ఎరీనాలను కూడా సీఎం ప్రారంభిస్తారు. తన పర్యటనలో భాగంగా ఎండాడలోని కాపు బిల్డింగ్, భీమిలిలో ఫిష్ ల్యాండింగ్ సెంటర్ కు శంకుస్థాపన చేస్తారు. 

అనంతరం, సాయంత్రం 6.15 గంటలకు ఎమ్మెల్యే గొల్ల బాబూరావు కుమారుడి పెళ్లి రిసెప్షన్ కు హాజరవుతారు. ఈ కార్యక్రమంతో సీఎం విశాఖ పర్యటన పూర్తవుతుంది. రాత్రి 7 గంటలకు ఆయన విశాఖ నుంచి తాడేపల్లి తిరుగు పయనం కానున్నారు. 

ఇవాళ విశాఖ పర్యటనకు వెళ్లే ముందు సీఎం జగన్ బిజీబిజీగా గడిపారు. రాష్ట్ర మున్సిపల్ శాఖపై అధికారులతో సమీక్ష జరిపారు. ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడితోనూ సమావేశమై పలు అంశాలు చర్చించారు. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి, పలు స్పోర్ట్స్ కాంప్లెక్స్ ల ఏర్పాటుపై రాయుడు సీఎంతో చర్చించినట్టు తెలుస్తోంది.

More Telugu News