Chandrababu: రైతులకు సాయం చేయడానికి రాకెట్ సైన్స్ చదవాలా అన్న జగన్ ఇప్పుడెక్కడ ముడుచుకుని కూర్చున్నాడు?: చంద్రబాబు

  • ఇటీవల ఏపీలో అకాల వర్షాలు
  • 15 జిల్లాల్లో పంట నష్టం జరిగిందన్న చంద్రబాబు
  • సీఎం జగన్ ఒక్క రైతును కూడా పరామర్శించలేదని ఆగ్రహం
  • మా రైతన్నల పంట మునిగింది... పరిహారం చెల్లించాలంటూ డిమాండ్
Chandrababu fires on CM Jagan

అకాల వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోతే ప్రభుత్వం సాయం చేయడంలేదని విపక్ష నేత చంద్రబాబు మండిపడ్డారు. అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను ఎందుకు ఆదుకోవడంలేదు? దెబ్బతిన్న పంటల వివరాలు ఇప్పటికీ ఎందుకు వెల్లడించడంలేదు? అని ప్రశ్నించారు. 

రాష్ట్రంలో నేటి అన్నదాతల ఆక్రందన రేపు పెను ఉప్పెన అవుతుందని, ఆ ఉప్పెనలో రైతు వ్యతిరేక ప్రభుత్వం కొట్టుకుపోతుందని చంద్రబాబు హెచ్చరించారు. 

"రబీ సీజన్ పంటల బీమా ప్రీమియం విషయంలో వాస్తవాలు దాచిపెట్టడానికి కారణాలు ఏంటి? అకాల వర్షాలకు అన్నదాతకు జరిగిన నష్టానికి ప్రభుత్వం ఇచ్చే నష్ట పరిహారం ఎక్కడ? దెబ్బతిన్న పంట ఎంత... కొన్న ధాన్యం ఎంత? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైతును ఆదుకోవడానికి రాకెట్ సైన్స్ చదవాలా అన్న జగన్... ఇప్పుడెక్కడ ముడుచుకుని కూర్చున్నాడు? రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలకు 15 జిల్లాల్లో పంట నష్టం జరిగితే ఒక్క రైతు దగ్గరకు కూడా ఈ ముఖ్యమంత్రి ఎందుకు వెళ్లలేదు?" అంటూ చంద్రబాబు ప్రశ్నల వర్షం కురిపించారు. మా రైతన్నల పంట మునిగింది... పరిహార ఇవ్వండి అంటూ ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News