Microsoft: మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు మరో షాక్!

Microsoft will not give salary hikes to full time employees this year
  • ఈ ఏడాది ఉద్యోగుల జీతాల్లో పెంపు ఉండదన్న సంస్థ 
  • ఉద్యోగులకు బోనస్‌‌లు, స్టాక్ ఆప్షన్స్, ఇతర ప్రోత్సాహకాలు యథాతథమని వెల్లడి
  • ఆర్థిక అనిశ్చితి నడుమ కీలక నిర్ణయాలు తప్పవని స్పష్టీకరణ
మైక్రోసాఫ్ట్‌ ఉద్యోగుల కష్టకాలం ఇంకా కొనసాగుతోంది. ఉద్యోగులకు మైక్రోసాఫ్ట్ యాజమాన్యం తాజాగా మరో షాకిచ్చింది. ఆర్థిక సవాళ్లు ఎదురవుతున్న నేపథ్యంలో ఈ ఏడాది సంస్థలోని ఫుల్ టైం ఉద్యోగుల జీతాలను పెంచబోమని తాజాగా స్పష్టం చేసింది. బోనస్‌లు, స్టాక్ అవార్డులు, ఇతర ప్రోత్సాహకాలు మాత్రం యథాతథంగా కొనసాగుతాయని చెప్పింది. ఈ జనవరిలో మైక్రోసాఫ్ట్ ఏకంగా పది వేల మందిని తొలగించిన విషయం తెలిసిందే. 

ఈ విషయమై మైక్రోసాఫ్ట్ ప్రతినిధి తాజాగా స్పందిస్తూ.. సంస్థ ఉద్యోగులు, వ్యాపారం, భవిష్యత్తుకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. సంస్థలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్న తరుణంలో ఇది మరింత ఆవశ్యకమని చెప్పారు. సంస్థ సీఈఓ సత్య నాదెళ్ల సారథ్యంలో మైక్రోసాఫ్ట్ కృత్రిమ మేథపై దృష్టిసారించిన విషయం తెలిసిందే. చాట్‌జీపీటీ రూపకర్త ఓపెన్ ఏఐ సంస్థలో పెట్టుబడులు కుమ్మరించింది. అంతేకాకుండా, ఏఐ ఉత్పత్తులను బింగ్ సర్చ్ ఇంజిన్‌తో పాటూ మైక్రోసాఫ్ట్ ఇతర ఉత్పత్తుల్లో సమ్మిళితం చేస్తోంది. 

మైక్రోసాఫ్ట్‌లో ప్రస్తుతం జరుగుతున్న ప్లాట్‌ఫాం షిప్ట్‌కు సంబంధించి ఉద్యోగులకు సత్య నాదెళ్ల ఇటీవలే ఓ లేఖ రాశారు. ఆర్థిక అనిశ్చితి, పెరుగుతున్న పోటీ, కృత్రిమ మేథ రంగంలో మార్పుల నేపథ్యంలో మైక్రోసాఫ్ట్‌లో కీలక మార్పులు జరుగుతున్నాయని ఆయన తన లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు.
Microsoft
IT sector

More Telugu News