Naga Chaitanya: నాగచైతన్యతో ప్రేమాయణంపై ఎట్టకేలకు పెదవి విప్పిన శోభిత ధూళిపాల

 Sobhita Dhulipala finally reacts to rumours with Naga Chaitanya
  • 2021లో విడిపోయిన నాగచైతన్య-సమంత
  • ఆ తర్వాత కొన్నాళ్లకే శోభితతో కలిసి కనిపించిన చైతన్య
  • తెలివి తక్కువ రాతలకు స్పందించాల్సిన అవసరం లేదన్న శోభిత
టాలీవుడ్ ప్రముఖ నటుడు నాగచైతన్యతో రిలేషన్‌షిప్‌పై నటి శోభిత ధూళిపాల ఎట్టకేలకు స్పందించింది. ఇటీవల వీరిద్దరూ పలుమార్లు కలిసి కనిపించడంతో వారిమధ్య ‘ఏదో’ ఉందన్న ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ రూమర్లపై అటు నాగచైతన్య కానీ, ఇటు శోభిత కానీ ఇప్పటి వరకు స్పందించలేదు. 

అయితే, తాజాగా శోభిత దీనిపై మాట్లాడుతూ.. తెలివి తక్కువ రాతలకు తాను స్పందించాల్సిన అవసరం లేదని, ఇలాంటి వాటికి స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఇసుమంతైనా లేదని స్పష్టం చేసింది. వారు ఏదో రాస్తే తాను వివరణ ఇచ్చుకోవడం ఏంటని ప్రశ్నించింది. తానే తప్పూ చేయలేదని, వాటికి స్పందించాల్సిన అవసరం తనకు లేదని స్పష్టం చేసింది. ఇలాంటి రాతలు రాయడం కంటే జీవితంపై దృష్టిపెట్టాలని, దానిని మెరుగుపరుచుకోవాలని, కామ్‌గా ఉండాలని, మంచి వ్యక్తిలా ఉండేందుకు ప్రయత్నించాలని సూచించింది.

విభేదాల కారణంగా నాగచైతన్య-సమంత 2021లో విడిపోయారు. ఆ తర్వాత కొన్ని నెలలకు శోభిత, చైతన్యకు సంబంధించిన రూమర్లు తెరపైకి వచ్చాయి. లండన్‌లోని ఓ రెస్టారెంట్‌లో వీరిద్దరూ కలిసి కనిపించడంతో ఆ ఊహాగానాలకు మరింత బలం చేకూరింది. రూమర్లు షికారు చేస్తున్నా వీరిద్దరూ ఇప్పటి వరకు ఎక్కడా బయటపడలేదు. తాజాగా, శోభిత ఈ రూమర్లపై ఘాటుగా సమాధానం ఇచ్చి నోళ్లు మూయించే ప్రయత్నం చేసింది. అయితే, వాటిపై స్పందించాల్సిన అవసరం లేదని చెప్పింది తప్ప తమ రిలేషన్‌షిప్‌పై మాట్లాడకపోవడం గమనార్హం.
Naga Chaitanya
Sobhita Dhulipala
Tollywood

More Telugu News