Visakhapatnam: విశాఖ వ్యాపారవేత్త భూముల వ్యవహారంపై హైకోర్టులో ప్రభుత్వానికి చుక్కెదురు

  • తమ భూమిని రద్దు చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవోను కొట్టివేయాలని కోర్టుకు వెళ్లిన వ్యాపారవేత్త
  • ప్రభుత్వ ఉత్తర్వులు కొట్టివేస్తూ సింగిల్ జడ్జి ఉత్తర్వుల జారీ
  • సింగిల్ జడ్జి తీర్పుపై అప్పీల్ కు వెళ్లిన ప్రభుత్వం
  • ప్రభుత్వ అప్పీల్ ను కొట్టివేసిన న్యాయస్థానం
Shock to AP government in marripalem land issue

విశాఖ మర్రిపాలెం భూవ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. ప్రభుత్వ అప్పీల్‌ను హైకోర్టు కొట్టివేసింది. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. విశాఖలో తనకు చట్టబద్ధంగా ఉన్న భూమిని రద్దు చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవోను కొట్టివేయాలని ప్రముఖ వ్యాపారవేత్త కాట్రగడ్డ లలితేష్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సింగిల్ జడ్జి జీవోను కొట్టివేస్తూ ఇంతకుముందు ఉత్తర్వులు జారీ చేశారు.

సింగిల్ జడ్జి తీర్పును రాష్ట్ర ప్రభుత్వం డివిజన్ బెంచ్ లో సవాల్ చేసింది. విచారణ జరిపిన న్యాయస్థానం యథాతథ స్థితిని కొనసాగిస్తూ గతంలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇరువైపుల వాదనల అనంతరం ఇప్పుడు ప్రభుత్వ అప్పీల్ ను కొట్టి వేసింది.

More Telugu News