Mallu Bhatti Vikramarka: అందుకే, సోమేశ్ కుమార్‌ను మళ్లీ తీసుకువచ్చారు: మల్లు భట్టివిక్రమార్క

Mallubhatti on behind Somesh Kumar entry as cm chief advisor
  • రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ లు పదవుల కోసం పాకులాడకూడదన్న భట్టి 
  • ముఫ్పై ఏళ్ల కోసం టోల్ వసూలు చేసే అధికారం ఇవ్వడంపై ప్రశ్న
  • సోమేశ్ కుమార్ ను స్కాముల కోసమే తీసుకున్నారని ఆరోపణ
  • సోమేశ్ హయాంలో తీసుకున్న నిర్ణయాలపై విచారణ చేపట్టాలని డిమాండ్

స్కాముల కోసమే సోమేశ్ కుమార్ ను మళ్లీ తీసుకువచ్చారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కాంగ్రెస్ పార్టీ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. మహేశ్వరం నియోజకవర్గంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ లు ఇంకా పదవుల కోసం పాకులాడవద్దని హితవు పలికారు. రిటైర్ అయ్యాక కూడా పదవులు పట్టుకొని వేలాడటం సరికాదన్నారు. రిటైర్డ్ అధికారులు వైదొలిగి యువతకు అవకాశం ఇవ్వాలని సూచించారు. ముప్పై ఏళ్ల కోసం టోల్ వసూలు చేసే అధికారం ఎవరికైనా ఇస్తారా అని ప్రశ్నించారు. అలా తీసుకుంటే వచ్చే ప్రభుత్వాలు ఏం చేస్తాయని నిలదీశారు.

 సోమేశ్ కుమార్ హయాంలో తీసుకున్న నిర్ణయాలపై విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఆయన కనుసన్నుల్లోనే హైదరాబాద్ చుట్టూ లక్షల కోట్ల రూపాయల భూములు చేతులు మారాయని మండిపడ్డారు. ఫార్మాసిటీ కట్టడానికి పేదల భూములు ఎందుకని, గజ్వేల్, సిరిసిల్లల్లో ప్రభుత్వ భూములు లేవా? అని నిలదీశారు. కేసీఆర్ లాక్కున్న భూములను తాము అధికారంలోకి వచ్చాక తిరిగి ఇస్తామన్నారు.

  • Loading...

More Telugu News