Priyanka Chopra: అప్పట్లో ఒకరి తర్వాత ఒకరితో డేటింగ్.. వారంతా గొప్పోళ్లే: ప్రియాంకా చోప్రా

Priyanka Chopra says all her actor ex boyfriends were great wonderful people
  • సెట్ లో తనతో కలసి పనిచేసిన నటులతో డేట్ చేసినట్టు వెల్లడి
  • ఒక బంధానికి మరో బంధానికి గ్యాప్ కూడా ఇవ్వలేదన్న ప్రియాంక 
  • తనకు తగిన వారేనా అని తెలుసుకునేందుకే అలా చేశానని వివరణ
బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా ఎంతో మంది సహ నటులతో సంబంధాలు కొనసాగించిన విషయాన్ని బయట పెట్టింది. ఆమె వ్యక్తిగత జీవితంపై గతంలో ఎక్కువ వార్తలు వచ్చేవి. కానీ, చివరికి తన కంటే చిన్న వాడైన, అమెరికాకు చెందిన నిక్ జోనాస్ ను పెళ్లాడి అమెరికాలో సెటిలైంది. అలెక్స్ కూపర్ పాడ్ కాస్ట్ ‘కాల్ హర్ డాడీ’తో మాట్లాడిన సందర్భంగా ప్రియాంకా చోప్రా తన వ్యక్తిగత జీవితంలోని విషయాలను పంచుకుంది. 

‘‘నేను ఒక బంధం నుంచి మరో బంధానికి, మరో బంధానికి మారాను. ఒక బంధం, మరొక బంధానికి మధ్య పెద్ద వ్యవధిని కూడా ఇవ్వలేదు. నేను ఎంతో బిజీగా పనిచేసేదాన్ని. దీంతో నేను కలసి పనిచేసిన నటులతో, సెట్ లో నాతో కలిసిన వారితో డేటింగ్ చేసేదాన్ని. రిలేషన్ షిప్ ఎలా ఉండాలనే దానిపై నాకు ఒక ఆలోచన ఉందనుకున్నాను. దాంతో నా జీవితంలోకి వచ్చిన వ్యక్తులు నాకు తగినట్టుగానే ఉన్నారా? అనేది తెలుసుకోవాలని అనుకున్నాను. గొప్ప వ్యక్తులతో నేను డేట్ చేశాను. నిజమే కొందరితో ఆ బంధాలు విషాదంగా ముగిసి ఉండొచ్చు. కానీ నేను నా జీవితంలో డేటింగ్ చేసిన వారు నిజంగా అద్భుతమైనవారు’’ అని ప్రియాంక పేర్కొంది. కానీ, చివరి బోయ్ ఫ్రెండ్ కు, నిక్ జోనాస్ కు మధ్య రెండేళ్ల విరామం తీసుకున్నట్టు కూడా వెల్లడించింది. 

బాలీవుడ్ లో షాహిద్ కపూర్, హర్మన్ బవేజా, షారుఖ్ ఖాన్.. ఇలా ఎంతో మంది పేర్లు అప్పట్లో ప్రియాంక విషయంలో వినిపించాయి. కానీ ఏ రోజూ కూడా ఫలానా నటుడితో తాను డేటింగ్ లో ఉన్నానని ఆమె చెప్పలేదు.
Priyanka Chopra
ex boyfriends
dating
revealed

More Telugu News