Telangana: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో మరో నలుగురి అరెస్ట్

  • ఏఈ, ఏఈఈ ప్రశ్నాపత్రాలు కొనుగోలు చేసినట్లు దర్యాఫ్తులో వెల్లడి
  • 27కు చేరుకున్న అరెస్టులు
  • నిందితులను రెండుసార్లు విచారించగా, వెలుగులోకి కీలక అంశాలు
Four arrested in tspsc paper leackage case

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో సిట్ అధికారులు మంగళవారం మరో నలుగురిని అరెస్ట్ చేశారు. ఈ నలుగురు ఏఈ, ఏఈఈ ప్రశ్నాపత్రాలు కొనుగోలు చేసినట్లు దర్యాఫ్తులో వెల్లడైంది. దీంతో ఈ కేసులో అరెస్టైన వారి సంఖ్య 27కు చేరుకుంది. 

నిందితులు ప్రవీణ్, డాక్యా నుండి వీరు ప్రశ్నాపత్రాలు కొనుగోలు చేసినట్లు గుర్తించారు. ప్రవీణ్, రాజశేఖరరెడ్డి, డాక్యానాయక్, రాజేశ్వర్ నాయక్ లను రెండుసార్లు కస్టడీకి తీసుకొని విచారించారు. అయితే వీరి నుంచి ఆశించిన మేర సమాచారం వెల్లడి కాలేదు.

దాంతో, బ్యాంకు ఖాతాల పరిశీలన, నిందితుల కాల్ డేటా ఆధారంగా సిట్ అధికారులు కూపీ లాగారు. వీటి ఆధారంగా పలువురిని ప్రశ్నించారు. దీంతో మరిన్ని విషయాలు వెలుగు చూశాయి. 

మురళీధర్ రెడ్డి, మనోజ్ ఏఈఈ ప్రశ్నాపత్రాన్ని కొనుగోలు చేసినట్లు కాల్ డేటా, బ్యాంకు ట్రాన్సాక్షన్ ఆధారంగా గుర్తించారు. ఈ రోజు అరెస్టైన నలుగురు కూడా డబ్బులు చెల్లించినట్లు గుర్తించారు. ఈ కేసుకు సంబంధించి సిట్ అధికారులు మరికొందరిని విచారిస్తున్నారు.

More Telugu News