అవార్డులు తెచ్చినోళ్లను వేధించడం సరికాదు: కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి
- జూనియర్ పంచాయతీ సెక్రటరీల రెగ్యులరైజేషన్‌పై సీఎంకు టీపీసీసీ చీఫ్ లేఖ
- వారిని బానిసలుగా చూడటం తప్ప హక్కులు పరిరక్షించడం లేదని ఆరోపణ
- వారి కష్టంతోనే గ్రామ పంచాయతీలకు 79 అవార్డులు వచ్చాయని వ్యాఖ్య
అవార్డులను తెచ్చిన వారిని వేధించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. జూనియర్ పంచాయతీ సెక్రటరీల కష్టానికి మీరు ఇచ్చే రివార్డ్ ఇదా? అని నిలదీశారు. గత ఏడాది వారి ప్రొబేషన్ ను పెంచిన సమయంలో అసెంబ్లీలో సీఎం హోదాలో రెగ్యులరైజ్ పైన హామీ ఇచ్చారని గుర్తు చేశారు. మీరు ఇచ్చిన హామీ ఏప్రిల్ 11వ తేదీతో ముగిసిందని, అయినప్పటికీ రెగ్యులరైజ్ పైన ప్రభుత్వం తీరు దున్నపోతు మీద వాన కురిసినట్లుగా ఉందన్నారు.