Ganta Srinivasa Rao: టెలిఫోన్ జంక్షన్ బాక్సులు జామ్ కావాల్సిందే తప్ప పరిష్కారం లభించదు: గంటా

Ganta Srinivas Rao comments on Jagannanaku Chebudham programme
  • నాలుగేళ్ల కాలంలో ప్రతి ఒక్కరి జీవితం సమస్యల వలయంగా మారిందన్న గంటా
  • స్పందనకు కాళ్లరిగేలా తిరిగినా ప్రయోజనం శూన్యమని వ్యాఖ్య
  • ఏపీలో సమస్యలు లేని వారు ఇప్పుడు ఎవరైనా ఉన్నారా అని ప్రశ్న
ఆంధ్రప్రదేశ్ లో ఈ నాలుగేళ్ల కాలంలో ప్రతి ఒక్కరి జీవితం సమస్యల వలయంగా మారిందని మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమంపై సోషల్ మీడియా వేదికగా గంటా స్పందించారు. స్పందనకు కాళ్లరిగేలా తిరిగినా ప్రయోజనం శూన్యమని, ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు సమస్యలు లేని వారు ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించారు.

అమరావతి రైతులు, వేతనం కోసం ఎదురు చూసే ఉద్యోగులు, సాయం కోసం చూస్తున్న పేద రైతులు, పెన్షన్ కోసం చూస్తున్న వారి సమస్యలు పరిష్కరిస్తారా? స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల సమస్యకు పరిష్కారం లభిస్తుందా అని పేర్కొన్నారు. వందల టోల్ ఫ్రీ నెంబర్లు పెట్టినప్పటికీ ప్రజా సమస్యలతో టెలిఫోన్ జంక్షన్ బాక్సులు జామ్ కావాల్సిందే కానీ సమస్యలకు పరిష్కారం లభించే పరిస్థితి మాత్రం లేదన్నారు.
Ganta Srinivasa Rao
YS Jagan
Andhra Pradesh

More Telugu News