Pawan Kalyan: రేపు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పవన్ కల్యాణ్ పర్యటన

Pawan Kalyan tour in East Godavari district tomorrow
  • అకాల వర్షాలతో పంటలకు తీవ్ర నష్టం
  • రైతులను పరామర్శించనున్న పవన్ కల్యాణ్
  • ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పలు నియోజకవర్గాల మీదుగా పవన్ పర్యటన
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ రేపు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. అకాల వర్షాలతో పంటలు కోల్పోయి నష్టాల పాలైన రైతులను పవన్ కల్యాణ్ పరామర్శించనున్నారు. పవన్ బుధవారం ఉదయం రాజమండ్రి చేరుకుంటారు. ఉమ్మడి గోదావరి జిల్లా పరిధిలో దెబ్బతిన్న పంటలను పరిశీలించి, రైతులను కలుసుకోనున్నారు. వారితో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకోనున్నారు. పవన్ పర్యటన పలు నియోజకవర్గాల మీదుగా సాగనుంది. ఈ పర్యటనలో పవన్ తో పాటు జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, ఆ పార్టీ రాష్ట్ర, జిల్లా నేతలు పాల్గొంటారు.
Pawan Kalyan
East Godavari District
Farmers
Janasena
Andhra Pradesh

More Telugu News