truecaller: త్వరలో వాట్సాప్ లోనూ ట్రూకాలర్!

  • మెసేజింగ్‌ యాప్‌లలో తమ సేవలు అందుబాటులోకి తెస్తామన్న ట్రూకాలర్ సీఈవో
  • మే తర్వాత ప్రారంభించే అవకాశం ఉందని వెల్లడి
  • వాట్సాప్ కు ఇంటర్నెట్ ద్వారా వచ్చే స్పామ్ కాల్స్ ను గుర్తించడం ఇక ఈజీ
truecaller is coming to whatsapp and why it is good news for users

ట్రూ కాలర్.. సగటు మనిషికి ఓ ఉపశమనం. మనకొచ్చే ఫోన్ కాల్.. ఎవరిదనేది, ఎలాంటిదనేది ముందే చెప్పేస్తుంది. స్కామ్, బిజినెస్, ఫ్రాడ్.. ఇలా ముందే సమాచారం ఇస్తుంది. కొత్త నంబర్ నుంచి వచ్చే ఫోన్ ఎవరి పేరు మీద ఉందో తెలియజేస్తుంది. నంబర్లు మార్చి పదే పదే చేసే ఫినాన్స్, మార్కెటింగ్ కాల్స్ నుంచి పెద్ద రిలీఫ్ ఇస్తుంది.

ఇప్పుడు స్పామ్‌ కాల్స్‌ను గుర్తించేందుకు త్వరలో వాట్సాప్‌లోనూ ట్రూకాలర్‌ సేవలను ప్రారంభించనున్నట్టు ట్రూకాలర్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ అలన్‌ మమెది తెలిపారు. రెండు వారాలుగా భారత్‌లో వాట్సాప్‌ ద్వారా స్పామ్‌ కాల్స్‌ వస్తున్నాయనే ఫిర్యాదులు వస్తున్నట్టు చెప్పారు. అందుకే మెసేజింగ్‌ యాప్‌లలోనూ తమ సేవలు అందుబాటులోకి తేవాలనుకుంటున్నట్టు చెప్పారు. మే తర్వాత ప్రారంభించే అవకాశం ఉందన్న ఆయన.. కచ్చితమైన తేదీ అంటూ ఏదీ ప్రకటించలేదు.

ఇప్పటికే ట్రూకాలర్, వాట్సాప్ ఒప్పందం చేసుకున్నాయి. స్వీడన్‌కు చెందిన ట్రూకాలర్ సేవలు వాట్సాప్ లో అందుబాటులోకి వస్తే.. ఇంటర్నెట్ ద్వారా వచ్చే స్పామ్ కాల్స్ ను గుర్తించడం ఇక సులభం కానుంది. ట్రూకాలర్ సర్వీసులు ఆడియోతోపాటు, వీడియో కాల్స్ కు కూడా అందుబాటులోకి రానున్నాయి.
 
ట్రూకాలర్ ఇప్పటిదాకా టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా వచ్చే కాల్స్ ను మాత్రమే గుర్తించేది. ఇంటర్నెట్ ద్వారా వాట్సాప్, సిగ్నల్ వంటి యాప్స్ నుంచి వచ్చే కాల్స్ ఐడెంటిఫై చేసేది కాదు. 2021లో ట్రూకాలర్‌ సంస్థ రూపొందించిన ఒక నివేదిక ప్రకారం భారత్‌లో సగటున ఒక్కొక్కరికి నెలకు 17 స్పామ్‌ కాల్స్‌ వస్తున్నాయి.

More Telugu News