honey: తేనె, గ్రీన్ టీతో బరువు తగ్గొచ్చా..?

  • గ్రీన్ టీ, తేనెతో దీర్ఘకాలంలో బరువు తగ్గడం సాధ్యమే
  • తేనె సహజసిద్ధమైన తక్కువ కేలరీలు ఉండే తీపి పదార్థం
  • రిఫైన్డ్ షుగర్ కంటే చాలా నయం
Is honey and green tea the best drink for weight loss

అధిక బరువుతో బాధపడే వారు.. ఏదో ఒక రకంగా తమ బరువు భారాన్ని తగ్గించుకోవాలనే కోరికతో ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. ఆహారం మానివేయడం, పస్తులుండడం,  చపాతీ తీసుకోవడం, నడక తదితర వ్యాయామాలు అనుసరించే వారు ఉన్నారు. గ్రీన్ టీ, తేనెతోనూ బరువు తగ్గేందుకు ప్రయత్నించే వారు కూడా ఉన్నారు. మరి నిజానికి గ్రీన్ టీ, తేనె తో బరువు తగ్గొచ్చా..?

అనవసర బరువు తగ్గేందుకు గ్రీన్ టీ సాయపడుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. గ్రీన్ టీలో శక్తిమంతమైన అకా కేటచిన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. జీవక్రియలకు బూస్ట్ నిచ్చే ఎపిగాలోకేటచిన్ ఉంటుంది. ఇది బరువును తగ్గిస్తుంది. కొవ్వును కరిగించేందుకు తోడ్పడుతుంది. 

తేనె కూడా మంచి ఎంపికే అవుతుంది. రిఫైన్డ్ షుగర్ కు ఇది మంచి ప్రత్యామ్నాయం. దీనివల్ల కొలెస్ట్రాల్ పెరగదు. గోరు వెచ్చని నీటిలో తేనె, నిమ్మరసం వేసుకుని తాగితే అది యాంటీ సెల్యులైట్ చికిత్సలో మంచి ఫలితాలను ఇస్తుంది. 

గ్రీన్ టీతో ఎన్నో లాభాలున్నా మనలో చాలా మంది దాన్ని తీసుకోరు. కారణం చేదుగా ఉండడమే. ఈ చేదును తగ్గించుకునేందుకు నీటిని 80 డిగ్రీలకు మించని వేడిలో మూడు లేదా ఐదు నిమిషాలకు మించి మరిగించకూడదు. ఆ తర్వాత అందులో ఒక చెంచా తేనె కలుపుకుని తీసుకోవచ్చు. గ్రీన్ టీ, తేనె తాగితే బరువు తగ్గిపోతారని అనుకోవద్దు. ఇది తాగుతూ వ్యాయామాలు చేయడం వల్ల ఫలితాలు కనిపిస్తాయని, చెడు కొవ్వులు కరిగిపోతాయని నిపుణులు చెబుతున్నారు. 

తేనె అన్నది సహజసిద్ధమైన తీపి పదార్థం. ఇందులో ఫ్రక్టోజ్, గ్లూకోజ్ ఉంటాయి. రిఫైన్డ్ షుగర్ తో పోలిస్తే గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ. షుగర్ కు బదులు తేనె తీసుకోవడం వల్ల తక్కువ కేలరీలు శరీరంలోకి వెళతాయని, దీర్ఘకాలంలో దీనివల్ల బరువు తగ్గుతారని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. కానీ, గుర్తు పెట్టుకోవాల్సింది ఏమిటంటే తెనెలోనూ కేలరీలు ఉంటాయి. కనుక పరిమితంగానే తీసుకోవాలి.

గ్రీన్ టీలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఇందులో కేటచిన్స్ ఉండడం వల్ల జీవక్రియల్లో చురుకుదనం వస్తుంది. దీంతో కొవ్వులు కరుగుతాయి. రోజువారీగా గ్రీన్ టీ తీసుకుంటే శరీర బరువు మోస్తరుగా తగ్గుతారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. కాకపోతే గ్రీన్ టీ వల్ల తగ్గే బరువు భారీగా ఉండదని గుర్తు పెట్టుకోవాలి. గ్రీన్ టీ, తేనె రెండింటికీ బరువు తగ్గించే గుణాలు ఉన్నాయి కనుక.. సాధారణ టీ, కాఫీ తాగే వారు వాటికి బదులు వీటిని తీసుకోవచ్చు.

More Telugu News