West Bengal: సుప్రీంకోర్టును ఆశ్రయించిన ‘ది కేరళ స్టోరీ’ నిర్మాత

  • ‘ది కేరళ స్టోరీ’ ప్రదర్శనపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిషేధం
  • హింసాత్మక ఘటనలు నివారించేందుకే ఈ నిషేధమని ప్రకటన
  • నిషేధాజ్ఞలను ఎత్తేయాలని కోరుతూ సర్వోన్నత న్యాయస్థానంలో నిర్మాత పిటిషన్
  • తమిళనాడులోనూ ఈ సినిమా ప్రదర్శిస్తున్న హాళ్ల వద్ద భద్రతకు వినతి
The Kerala Story makers move SC seek removal of ban in west bengal

‘ది కేరళ స్టోరీ’ సినిమా ప్రదర్శనపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం విధించిన నిషేధాన్ని ఎత్తేయాలంటూ సినిమా నిర్మాత తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తమిళనాడులో తమ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్ల వద్ద భద్రత ఏర్పాటు చేయాలని తమిళనాడు ప్రభుత్వాన్ని కూడా తన పిటిషన్‌లో కోరారు. 

పశ్చిమ బెంగాల్‌లో ది కేరళ స్టోరీ సినిమాను తక్షణం నిలిపివేయాలంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతాబెనర్జీ సోమవారం ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో, ఈ సినిమాను నిషేధించిన తొలి రాష్ట్రంగా పశ్చిమబెంగాల్ నిలిచింది. ఎటువంటి హింసాత్మక ఘటనలు జరగకుండా ఉండేందుకు ఈ నిషేధం విధిస్తున్నట్టు పశ్చిమబెంగాల్ ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించిన సినిమా హాళ్లపై చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించింది.  

కాగా, పశ్చిమ బెంగాల్ నిర్ణయంపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందించారు. ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారో తనకు అస్సలు అర్థం కాలేదని వ్యాఖ్యానించారు. బాధిత యువతులకు అండగా ఉండాల్సిన అధికార టీఎంసీ పార్టీ ఉగ్రవాద సంస్థలపై సానుభూతి ఎందుకు ప్రదర్శిస్తోందని ప్రశ్నించారు. ఈ సినిమాను మంత్రి ఢిల్లీలోని ఓ సినిమా హాల్‌లో వీక్షించారు.

More Telugu News