Kerala stories: మధ్యప్రదేశ్ బాటలో యూపీ సర్కారు.. ‘కేరళ స్టోరీస్’ కు టాక్స్ ఫ్రీ

  • ట్విట్టర్ లో వెల్లడించిన సీఎం యోగి ఆదిత్యనాథ్
  • బెంగాల్ లో ఆ సినిమా ప్రదర్శనపై బ్యాన్ విధించిన దీదీ
  • సినిమాపై విమర్శలు గుప్పించిన కేరళ ముఖ్యమంత్రి
UP CM Yogi Says Will Make The Kerala Story Tax Free

‘ది కేరళ స్టోరీస్’ సినిమాకు ఉత్తరప్రదేశ్ లో పన్ను మినహాయింపు కల్పిస్తామంటూ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మంగళవారం ప్రకటించారు. బెంగాల్ లో ఈ సినిమా ప్రదర్శనను బ్యాన్ చేస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ మరుసటి రోజే యోగి సర్కారు ఈ టాక్స్ ఫ్రీ ప్రకటన చేశారు. ఇప్పటికే ఈ సినిమాకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం పన్ను మినహాయింపును ఇచ్చింది. కాగా, కేరళ ప్రభుత్వం మాత్రం ఈ సినిమాపై మండిపడుతోంది. అవాస్తవాలు ప్రచారం చేస్తూ సమాజంలో శాంతిభద్రతలకు భంగం కలిగించేలా ఉందని ఈ సినిమాపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేరళకు చెందిన ముగ్గురు యువతులు మతం మార్చుకుని ఐసిస్ లో చేరడం, దాని వెనకున్న పరిస్థితులకు సంబంధించిన కథే ఈ కేరళ స్టోరీస్ సినిమా. ఈ సినిమా వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే! సినిమాను బ్యాన్ చేయాలంటూ ఆందోళనలు కూడా జరుగుతున్నాయి. తమిళనాడులో థియేటర్ల ముందు పలు సంఘాలు నిరసన ప్రదర్శన చేయడంతో యాజమాన్యాలు ఈ సినిమా ప్రదర్శనను ఆపేశాయి. అయితే, కేరళ స్టోరీస్ సినిమాకు అన్ని రాష్ట్రాలు పన్ను మినహాయింపు కల్పించాలంటూ బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఈ సినిమాను విద్యార్థులతో కలిసి చూశారు.

More Telugu News