ధోనీపై ప్రశంసల జల్లు కురిపించిన సీఎం స్టాలిన్
- తాను ధోనీకి అతిపెద్ద ఫ్యాన్ అని చెప్పిన స్టాలిన్
- ధోనీ బ్యాటింగ్ చూసేందుకు ఇటీవల రెండు సార్లు స్టేడియంకు వెళ్లానని వెల్లడి
- ధోనీ తమిళనాడు దత్తపుత్రుడని కితాబు
సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన ధోనీ స్వయంకృషితో, పట్టుదలతో నేషనల్ ఐకాన్ గా ఎదిగాడని కొనియాడారు. తమిళనాడు ప్రభుత్వ క్రీడాశాఖ ఆధ్వర్యంలో 'తమిళనాడు ఛాంపియన్ షిప్ ఫౌండేషన్' మస్కట్ తో పాటు థీమ్ సాంగ్ ను స్టాలిన్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ధోనీ ఫౌండేషన్ లోగో, పోర్టల్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్టాలిన్ మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు.