ajit doval: సౌదీ అరేబియా సహా ఆ దేశాలతో అజిత్ దోవల్ సీక్రెట్ చర్చలు!

NSA Ajit Doval in secret talks in Saudi Arabia to shape a counter to China
  • సౌదీతో పాటు అమెరికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ముఖ్యులతో నిన్న దోవల్ చర్చలు
  • సౌదీ అరేబియాలో ఈ ప్రతినిధుల భేటీ
  • ఆస్ట్రేలియాలో మరోసారి భేటీ కానున్న అమెరికా-భారత్ ప్రతినిధులు
భారత నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ నిన్న అగ్రరాజ్యం అమెరికా, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్ ప్రతినిధులతో సమావేశమైనట్లుగా మీడియాలో వార్తలు వచ్చాయి. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ద్వారా చైనా తన ముద్రను మరింత విస్తరించే ప్రయత్నం చేస్తోంది. ఇలాంటి సమయంలో అజిత్ దోవల్ కీలక చర్చలు చేపట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈ నెలాఖరులో ఆస్ట్రేలియాలో జరిగే క్వాడ్ సమ్మిట్ సందర్భంగా దోవల్, అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ మరోసారి సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి సంబంధించిన కచ్చితమైన వివరాలు వెల్లడి కాలేదు. 

అయితే నిన్న వైట్ హౌస్ ఒక ప్రకటన చేస్తూ... "జాతీయ భద్రతా సలహాదారు జేక్, సౌదీ ప్రధాన మంత్రి, క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్, యుఏఈ జాతీయ భద్రతా సలహాదారు షేక్ తహ్నూన్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఆఫ్ ఇండియా అజిత్ దోవల్ తో మే 7న సౌదీ అరేబియాలో సమావేశం జరిగింది" అని వెల్లడించింది. మిడిల్ ఈస్ట్ గురించి చర్చించినట్లు ఆ ప్రకటనలో పేర్కొంది.
ajit doval
america
india
Saudi Arabia
uae

More Telugu News