The Kerala Story: అందుకే 'కేరళ స్టోరీ' సినిమాను నిషేధిస్తున్నాం: మమతా బెనర్జీ

  • సుదీప్తో సేన్ దర్శకత్వంలో ది కేరళ స్టోరీ చిత్రం
  • దేశవ్యాప్తంగా వివాదాస్పదమైన చిత్రం
  • పశ్చిమ బెంగాల్ లో నిషేధం
  • ఇది వక్రీకరించిన కథ అన్న మమతా బెనర్జీ
Mamata Banarjee says West Bengal govt banned The Kerala Story movie

ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ది కేరళ స్టోరీ చిత్రం దేశవ్యాప్తంగా తీవ్ర వివాదాస్పదమైంది. వివిధ పార్టీలు, ముస్లిం సంఘాలు ఈ సినిమాలను వ్యతిరేకిస్తున్నాయి. దాంతో అనేకచోట్ల ఈ సినిమా ప్రదర్శనలను థియేటర్ యాజమాన్యాలే నిలిపివేస్తున్నాయి. 

కేరళలో అదృశ్యమైన 32 వేల మంది అమ్మాయిలు చివరికి ఎక్కడ తేలారన్నది ఈ చిత్ర కథాంశం. మతం మారిన అమ్మాయిలు ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడినట్టు ఈ చిత్రంలో చూపించారు. ది కేరళ స్టోరీ చిత్రానికి సుదీప్తో సేన్ దర్శకత్వం వహించారు. 

కాగా, ఈ చిత్రంపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిషేధం విధించింది. దీనిపై సీఎం మమతా బెనర్జీ స్పందించారు. ది కేరళ స్టోరీ సినిమా వక్రీకరించిన కథ అని పేర్కొన్నారు. ఈ సినిమా వివాదాలు రెచ్చగొట్టేలా ఉందని అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకునే నిషేధం విధించామని మమతా బెనర్జీ స్పష్టం చేశారు.

More Telugu News