banks: గృహ రుణాలపై తక్కువ వడ్డీ రేట్లు ఈ బ్యాంకుల్లో..

  • వడ్డీ రేటులో వ్యత్యాసంతో చెల్లింపుల్లో భారీ అంతరం
  • ఆకర్షణీయమైన రేటుకు తీసుకుంటే దీర్ఘకాలంలో ఎంతో ఆదా
  • వడ్డీ రేటుపై క్రెడిట్ స్కోరు, చెల్లింపుల సామర్థ్యం ప్రభావం
banks offering cheapest home loan interest rates

మొదటిసారి గృహ రుణం తీసుకుంటున్నారా..? తక్కువ వడ్డీ రేటు ఉన్న బ్యాంకును సంప్రదించడం మంచిది. దీనివల్ల ఎంతో ఆదా చేసుకోవచ్చు. సాధారణంగా గృహ రుణాలను ఎక్కువ మంది లబ్ధిదారులు 15-30 ఏళ్ల కాలానికి తీసుకుంటూ ఉంటారు. దీర్ఘకాలానికి అది కూడా భారీ రుణం తీసుకునే సమయంలో తప్పకుండా వడ్డీ రేటును చూడాల్సిందే. లేదంటే మొత్తం కాల వ్యవధిలో వడ్డీ రూపంలో రూ.లక్షలు అదనంగా చెల్లించాల్సి వస్తుంది. ముందుగా కాస్త విచారించి ఆకర్షణీయమైన రేటుకు ఇస్తున్న మంచి సేవలతో కూడిన బ్యాంక్ ను ఎంపిక చేసుకుంటే ఎంతో ప్రయోజనం పొందొచ్చు.

గృహ రుణంపై వడ్డీ రేటు అందరికీ ఒకే మాదిరి ఉంటుందని అనుకోవద్దు. దరఖాస్తుదారుడి క్రెడిట్ స్కోరు కీలక పాత్ర పోషిస్తుంది. చెల్లింపుల సామర్థ్యాన్ని బ్యాంకులు చూస్తాయి. కొనుగోలు చేస్తున్న లేదా ఇల్లు కడుతున్న ప్రాంతానికి ఉన్న డిమాండ్ ను చూస్తాయి. వీటి ఆధారంగా రిస్క్ ను విశ్లేషిస్తాయి బ్యాంకులు. ఇవన్నీ వడ్డీ రేటుపై ప్రభావం చూపిస్తాయి.

బ్యాంక్కనీస వడ్డీ రేటు (శాతంలో)గరిష్ఠ వడ్డీ రేటు
ఇండస్ ఇండ్ బ్యాంక్8.49.75
ఇండియన్ బ్యాంక్8.459.1
హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్8.459.85
యూకో బ్యాంక్8.4510.3
బ్యాంక్ ఆఫ్ బరోడా8.510.5
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర8.610.3
యూనియన్ బ్యాంక్8.7510.5
ఐడీబీఐ బ్యాంక్8.7510.5
పంజాబ్ నేషనల్ బ్యాంక్8.89.45
కోటక్ మహీంద్రా బ్యాంక్8.859.35

More Telugu News