Texas: టెక్సాస్ నుంచి రేపు సాయంత్రానికి హైదరాబాద్ చేరుకోనున్న ఐశ్వర్య మృతదేహం

  • మాల్ లో దుండగుడు జరిపిన కాల్పుల్లో చనిపోయిన హైదరాబాదీ యువతి
  • పాస్ పోర్ట్, వేలిముద్రల ఆధారంగా తాటికొండ ఐశ్వర్యగా గుర్తించిన పోలీసులు
  • తానా ప్రతినిధుల ద్వారా కూతురు మరణవార్త తెలుసుకున్న ఐశ్వర్య తల్లిదండ్రులు
Arrangements making to transport Telugu Girl Aishwarya Dead Body to India

అమెరికాలోని టెక్సాస్ లో దుండగుడి కాల్పులలో చనిపోయిన ఐశ్వర్య మృతదేహాన్ని హైదరాబాద్ కు పంపించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఫ్యూనరల్ సెంటర్ లోనే అవసరమైన ఏర్పాట్లు చేసి, డెడ్ బాడీని పంపించనున్నట్లు తెలిపారు. అమెరికా అధికారులు, తానా ప్రతినిధులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం సాయంత్రానికి ఐశ్వర్య మృతదేహం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటుందని తెలుస్తోంది.
 
హైదరాబాద్ కు చెందిన తాటికొండ ఐశ్వర్య అమెరికాలోని పర్ ఫెక్ట్ జనరల్ కాంట్రాక్టర్స్ అనే కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్ గా పనిచేస్తున్నారు. ఈ నెల 6న టెక్సాస్ లోని ఓ షాపింగ్ మాల్ లో దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఎనిమిది మంది చనిపోయారని వార్తలు రావడంతో ఐశ్వర్య తల్లిదండ్రులు ఆందోళన చెందారు. ఐశ్వర్యకు ఫోన్ చేయగా అటునుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో ఐశ్వర్య తండ్రి, రంగారెడ్డి జిల్లా జడ్జి నర్సిరెడ్డి టెక్సాస్‌లోని తానా ప్రతినిధులను సంప్రదించారు.

తానా మెంబర్ అశోక్ కొల్లా చొరవ తీసుకుని ఐశ్వర్యను సంప్రదించేందుకు ప్రయత్నించారు. ఈ ప్రయత్నం విఫలం కావడంతో ఎఫ్ బీఐ అధికారులతో సంప్రదింపులు జరిపారు. మాల్ లో చనిపోయిన వారి వివరాలను పరిశీలించగా.. అందులో ఐశ్వర్య పేరు ఉంది. దీంతో అధికారులను అశోక్ కొల్లా ఎఫ్ బీఐ అధికారులను సంప్రదించారు. పాస్ పోర్టు, వేలిముద్రలను పరీక్షించిన తర్వాతే చనిపోయింది ఐశ్వర్యేనని నిర్ధారించినట్లు పోలీసులు తెలిపారు. ఐశ్వర్య మృతిని నిర్ధారించుకున్న తర్వాత అశోక్ కొల్లా ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించారు.

More Telugu News