Parineeti Chopra: పెళ్లి వార్తల నడుమ.. ఆప్ ఎంపీతో డిన్నర్ డేట్‌ కు వెళ్లిన బాలీవుడ్ నటి

Parineeti Chopra and Raghav Chadha step out on a dinner date amid engagement rumours
  • కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా, పరిణీతి చోప్రా
  • నిన్న రాత్రి ముంబై రెస్టారెంట్ కు వచ్చిన జంట 
  • ఈ నెల 13న నిశ్చితార్థం జరుగుతుందని వార్తలు
ప్రేమ పక్షులు బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా  మరోసారి వార్తల్లో నిలిచారు. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న ఈ జంట ఆదివారం ముంబైలో డిన్నర్ డేట్ కు వెళ్లారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఓ రెస్టారెంట్ కు వచ్చిన ఈ ఇద్దరినీ అక్కడున్న వాళ్లు పెళ్లి గురించి అడుగుతూ...శుభాకాంక్షలు తెలిపారు. అయితే, ఎలాంటి వివరాలు వెల్లడించని జంట వారికి కృతజ్ఞతలు చెప్పారు. 

కాగా, ఈ నెల 13న కుటుంబ సభ్యుల సమక్షంలో వీరిద్దరి నిశ్చితార్థం జరగనుందని సమాచారం. అయితే తమపెళ్లి గురించి పరిణీతి, రాఘవ ఇప్పటిదాకా పెదవి విప్పడం లేదు. గత వారం పరిణీతి ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా కార్యాలయంలో కనిపించింది. ఎంగేజ్ మెంట్ డ్రెస్ కోసమే అక్కడికి వచ్చినట్టు తెలుస్తోంది. నిశ్చితార్థానికి ముందు జరిగే సంప్రదాయ రోకా వేడుక కూడా పూర్తయిందని సమాచారం. అక్టోబర్ చివర్లో వీరి పెళ్లి జరుగుతుందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
Parineeti Chopra
Bollywood
Raghav Chadha
AAP
MP
Dinner

More Telugu News