Mayawati: తెలంగాణలో పాగా వేద్దాం... పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన మాయావతి

Mayavati calls BSP cadre to fight in Telangana elections
  • హైదరాబాదులో తెలంగాణ భరోసా సభ నిర్వహించిన బీఎస్పీ
  • ముఖ్య అతిథిగా హాజరైన మాయావతి
  • వచ్చే ఎన్నికలకు సన్నద్ధం కావాలని పార్టీ శ్రేణులకు  నిర్దేశం
హైదరాబాదులోని సరూర్ నగర్ స్టేడియంలో బీఎస్పీ (బహుజన సమాజ్ పార్టీ) ఆధ్వర్యంలో ఈ సాయంత్రం తెలంగాణ భరోసా సభ నిర్వహించారు. ఈ సభకు బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగిస్తూ, తెలంగాణలో పాగా వేద్దాం అని రాష్ట్ర బీఎస్పీ శ్రేణులకు పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికలకు సన్నద్ధం కావాలని నేతలకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. 

తెలంగాణలో దళితులకు మూడెకరాల భూమిని ఇస్తానన్న కేసీఆర్ మాట తప్పారని మాయవతి వ్యాఖ్యానించారు. బీఎస్పీ కేవలం ఎస్సీల కోసం మాత్రమే కాదని, సకల వర్గాల సంక్షేమాన్ని కోరుకుంటుందని, ఆ దిశగా పనిచేస్తుందని స్పష్టం చేశారు. అణగారిన వర్గాల కోసం తన జీవితాన్ని అంకితం చేశానని మాయావతి ఈ సందర్భంగా పేర్కొన్నారు.
Mayawati
BSP
Hyderabad
Telangana

More Telugu News