Droupadi Murmu: రాష్ట్రపతి మాట్లాడుతుండగా పోయిన కరెంట్.. చీకట్లోనే ప్రసంగం

  • ఒడిశాలోని మయూర్‌భంజ్‌లో ఘటన
  • రామచంద్ర భంజదేవ్ వర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొన్న ముర్ము
  • 9 నిమిషాలపాటు పోయిన కరెంట్
  • చీకటి, వెలుగులను సమానంగా చూడాలన్న రాష్ట్రపతి
Power outage during President Droupadi Murmus address in Odisha

ఓ కార్యక్రమంలో రాష్ట్రప్రతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తుండగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అయినప్పటికీ ఆమె తన ప్రసంగాన్ని కొనసాగించి ముగించారు. ఒడిశాలో జరిగిందీ ఘటన. మూర్‌భంజ్ జిల్లా బరిపదలోని మహారాజ శ్రీరామచంద్ర భంజదేవ్ వర్సిటీలో నిన్న స్నాతకోత్సవం నిర్వహించారు. 

ఈ కాన్వొకేషన్‌లో పాల్గొన్న రాష్ట్రపతి ప్రసంగిస్తున్న సమయంలో సరిగ్గా ఉదయం 11.56 గంటల నుంచి దాదాపు 9 నిమిషాలపాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో యూనివర్సిటీ ఆడిటోరియంలో చీకట్లు అలముకున్నాయి. అయినప్పటికీ తన ప్రసంగాన్ని ద్రౌపది ఆపలేదు.

పోడియం నుంచి వస్తున్న వెలుతురు మధ్య తన ప్రసంగాన్ని కొనసాగించారు. చీకటి, వెలుగులను సమానంగా చూడాలనే విషయాన్ని ఈ ఘటన నుంచి మనం నేర్చుకోవాలని పేర్కొంటూ తన ప్రసంగాన్ని కొనసాగించి పూర్తి చేశారు.

More Telugu News