Karnataka: మేం కనీసం 141 సీట్లు గెలవడం ఖాయం: కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్

  • ముఖ్యమంత్రి పదవి విషయంలో అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా ఓకే
  • 1978లో విజయం సాధించినట్లే ఈసారి లోక్‌సభ ఎన్నికలకు తలుపులు తెరుస్తామని వ్యాఖ్య
  • బీజేపీ మేనిఫెస్టోపై శివకుమార్ ఆగ్రహం
DK Shivakumar says Congress will win at least 141 seats

మే 10న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ కనీసం 141 సీట్లు గెలుచుకుంటుందని కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ శనివారం ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి పదవి విషయంలో పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా తాను కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. పిటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. కర్ణాటకలో కాంగ్రెస్‌కు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన మెజారిటీ వస్తుందని, 1978లో రాష్ట్రంలో పార్టీ విజయం సాధించినట్లే ఈ విజయం లోక్‌సభ ఎన్నికలకు తలుపులు తెరుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

బీజేపీ తమ మేనిఫెస్టోలో యూనిఫామ్ సివిల్ కోడ్, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ అంశాల్ని చేర్చడంపై ఆయన మండిపడ్డారు. కర్ణాటకలో బీజేపీకి ఒక స్పష్టమైన అజెండా లేదన్నారు. మోదీ ఫ్యాక్టర్ ఇప్పుడు ఇక్కడ పని చేయదన్నారు. కాంగ్రెస్ సంపూర్ణ మెజార్టీతో అధికారంలోకి తీసుకురావడానికి తమ పార్టీ నేతలం అందరం ఏకతాటిపై ఉన్నామన్నారు. పార్టీ గెలుపు తమ తొలి ప్రాధాన్యత అన్నారు.

More Telugu News