Actor: లిక్విడ్ డైట్ తో బరువు తగ్గానంటున్న సినీ నటుడు

  • బరువు తగ్గాలంటే ప్రత్యేకమైన సర్జరీల అవసరమే లేదు
  • ఆహారంలో మార్పులు, శారీరక వ్యామామంతో మంచి ఫలితాలు
  • నటుడు తుషార్ కుమార్ జీవితంలో కనిపించిన మార్పులు
Actor tushar kumar shares weight loss story

అధిక బరువు సమస్యతో నేడు ఎందరో బాధపడుతున్నారు. పరిమితికి మించి బరువు ఎక్కువ కాలం పాటు కొనసాగితే అది అనారోగ్యాలకు దారితీస్తుంది. కనుక బరువు తగ్గాలని కోరుకునే వారు, ఎంత ప్రయత్నించినా సఫలం కాలేని వారు.. ఓ సారి ద్రవ పదార్థాలతో కూడిన ఆహార విధానాన్ని అనుసరిస్తే ఎలా ఉంటుందో..? ఎందుకంటే ఆస్ట్రేలియాకు చెందిన నటుడు తుషార్ కుమార్ లిక్విడ్ డైట్ తో నెలరన్న రోజుల్లో 15 కిలోల బరువు తగ్గినట్టు స్వయంగా వెల్లడించారు. 

తేరియాద్ అనే మ్యూజిక్ వీడియోలో తుషార్ కుమార్ తాజాగా నటించారు. త్వరలో రానున్న దస్తక్ అనే షార్ట్ ఫిల్మ్ లోనూ నటిస్తున్నారు. ఈ నటుడు కొన్నేళ్ల క్రితం 30 కిలోల బరువు తగ్గించుకున్నారు. కానీ, కరోనా సమయంలో తిరిగి బరువు పెరిగినట్టు చెప్పారు. ఒత్తిడి, జీవనశైలి అలవాట్ల వల్లే తాను బరువు పెరగడానికి కారణంగా పేర్కొన్నారు. క్రమశిక్షణ, జీవనశైలిలో మార్పులతో నెలన్నరలోనే 15 కిలోల బరువు తగ్గినట్టు (111 కిలోల నుంచి 96 కిలోలకు) తెలిపారు.

‘‘గుజరాత్ లో షూటింగ్ కు వెళ్లిన సమయంలో కొందరు నా చుట్టూ చేరి.. సర్ మీ నటన, ఎత్తు చూడ్డానికి ఎంతో బావున్నాయి. మీ శరీర బరువు తగ్గించుకుంటే మరింత బాగుంటుందంటూ సూచించారు. తర్వాత మూడు నెలల కాలంలో మూడు మ్యాజిక్ సాంగ్స్ లో నటించే అవకాశం రావడంతో భారత్ కు వచ్చాను. అప్పుడు కూడా అవే సూచనలు (బరువు తగ్గాలంటూ) వినిపించాయి. షూట్ అయిన వీడియో పాటలు చూసినప్పుడు నా రూపం చూడ్డానికి అంత బాగోలేదని తెలిసింది’’ అని వివరించారు. అప్పుడు ఆయన బరువు తగ్గడంపై దృష్టి పెట్టారు.

ఆహార నియమాలు
ఉదయమే నీరు తాగడం. ఆ తర్వాత కొంత సమయానికి కాఫీ తీసుకోవడం. ఆ తర్వాత నేరుగా మధ్యాహ్నం లంచ్ కింద ఒక దోస కాయ, టీ లేదా కాఫీ తాగేవారు. సాయంత్రం స్నాక్ కింద క్యారట్ లేదా ఉడికించిన కోడి గుడ్డు తినే వారు. కాఫీ లేదా టీ, నిమ్మ రసం తీసుకునేవారు. రాత్రి డిన్నర్ ను సాయంత్రం 6 గంటలకే చేసే వారు. ఆ సమయంలో ఆయన నచ్చింది తినేవారు. రాత్రి వేళ ఎప్పుడైనా ఆకలి అనిపిస్తే యాపిల్ తినేవారు. చల్లటి నీటి స్థానంలో గోరువెచ్చని నీటిని చేర్చారు. ఆహారం నుంచి కావాల్సిన పోషకాలు అందనందున ప్రతి రోజూ మల్టీ విటమిన్లు తీసుకునేవారట. రాత్రి కనీసం 7 గంటలు నిద్ర పోయే వారు. మొదట్లో ఈ డైట్ మెనూతో ఆయనకు ఎక్కువ ఆకలి వేసింది. కానీ, పట్టుదలతో అలానే కొనసాగించారు. వ్యాయామాలు కూడా చేసే వారు. తక్కువ ఆహారం, సరైన ఆహారం తినాలి. చురుగ్గా ఉండాలి. తగినంత నిద్ర పోయి, ఒత్తిడి లేకుండా చూసుకోవాలని ఆయన గ్రహించారు.

More Telugu News