Anand Mahindra: మీకు డెస్టినీపై నమ్మకం లేదా? అయితే ఈ వీడియో చూడండి.. మిమ్మల్ని మళ్లీ ఆలోచించేలా చేస్తుంది!: ఆనంద్ మహీంద్రా

death passed from near the young man anand mahindra shared the video
  • వైరల్ వీడియోను షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా
  • ఫుట్‌పాత్‌పై నిల్చున్న వ్యక్తి పక్కకెళ్లగానే దూసుకొచ్చిన కారు
  • ఐదు క్షణాలు ఆలస్యం చేసి ఉంటే ప్రాణాలు పోయేవే
‘శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు’ అని అంటారు. కర్మ సిద్ధాంతాన్ని, విధిని నమ్మేవాళ్లు ఈ మాటతో ఏకీభవిస్తారు. మనం తెలిసో, తెలియకో చేసే ప్రతి పని వెనుక ఓ బలమైన కారణం ఉంటుందని గట్టిగా విశ్వసిస్తారు.

ఇప్పుడు ఇదంతా ఎందుకంటారా?.. కింద ఉన్న వీడియోను ఓ సారి చూడండి. ఎందుకో అర్థమవుతుంది. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా షేర్ చేశారు. ‘‘మీకు కర్మ లేదా విధిపై నమ్మకం లేకపోతే.. ఈ వీడియో మిమ్మల్ని మళ్లీ ఆలోచించేలా చేస్తుంది!’’ అని ఆయన రాసుకొచ్చారు.

ఓ వ్యక్తి ఫుట్‌పాత్‌పై నిల్చొని ఉన్నాడు. ఎందుకు అక్కడ ఉన్నాడో, ఎవరి కోసం ఎదురు చూశాడో, ఆ క్షణం ఏమనిపించిందో.. అక్కడి నుంచి చిరాగ్గా పక్కకి వెళ్లిపోయాడు. ఒక ఐదు అడుగులు నడిచి ఉంటాడేమో.. ఓ కారు అతి వేగంతో వచ్చి.. అంతకుముందు ఆ వ్యక్తి నిలుచున్న చోట స్తంభాన్ని ఢీకొట్టింది.

కేవలం ఐదే సెకెన్లలో ఇదంతా జరిగిపోయింది. ఆ వ్యక్తి అక్కడే నిలుచుని ఉన్నా, మధ్యలో స్తంభం అడ్డులేకున్నా.. ప్రాణాలు పోయేవే. అక్కడే ఉన్న సీసీటీవీ ఫుటేజీలో ఇదంతా రికార్డయింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీరూ చూసేయండి.
Anand Mahindra
death passed from near the young man
Karma
Destiny

More Telugu News