MLA: మొన్న రేవంత్ రెడ్డి.. నేడు రాజా సింగ్​.. సచివాలయంలోకి నో ఎంట్రీ!

  • మంత్రి తలసాని నేతృత్వంలో సచివాలయంలో 
    గ్రేటర్ ప్రజాప్రతినిధుల సమావేశం
  • ఆహ్వానం అందడంతో బుల్లెట్ పై సచివాలయానికి వచ్చిన రాజా సింగ్
  • భద్రతా సిబ్బంది అనుమతించకపోవడంతో వెనక్కి వచ్చేసిన ఎమ్మెల్యే
MLA Rajasingh denies entry to New Secretariat

తెలంగాణ ప్రభుత్వం భారీ ఖర్చుతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన నూతన సచివాలయంలో సామాన్యులతో పాటు ప్రజా ప్రతినిధులకు కూడా ఎంట్రీ లేదన్న విమర్శలు పెరిగిపోతున్నాయి. కొన్ని రోజుల కిందట ఎంపీ రేవంత్ రెడ్డిని సచివాలయంలోకి వెళ్లకుండా పోలీసులు మార్గమధ్యంలోనే అడ్డుకున్నారు. తాజాగా బీజేపీ బహిష్కృత నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ కు అలాంటి చేదు అనుభవమే ఎదురైంది. 

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నేతృత్వంలో సచివాలయంలో గ్రేటర్ ప్రజాప్రతినిధులతో శనివారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే రాజాసింగ్‌కు కూడా ఆహ్వానం పంపారు. బుల్లెట్ పై వచ్చిన రాజా సింగ్ ను భద్రతా సిబ్బంది లోపలికి అనుమతించలేదు. మీటింగ్‌ అని చెప్పి తనను ఆహ్వానించి, లోపలికి అనుమతించకపోవడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ఎమ్మెల్యేలు కూడా సచివాలయంలోనికి రాకూడదా అంటూ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొద్దిసేపు అక్కడే వేచి ఉండి, రాజాసింగ్ తిరిగొచ్చేశారు. అయితే, తాము ఆహ్వానం పంపినప్పటికీ రాజాసింగ్ గేటు వరకు వచ్చి వెళ్లిపోయారని మంత్రి తలసాని పేషీ ప్రకటించినట్టు తెలుస్తోంది.

More Telugu News