Hardhik Pandya: నా సక్సెస్ కు ఇదే కారణం: హార్దిక్ పాండ్యా

Accepting my faults is my success says Hardhik Pandya
  • ఐపీఎల్ లో దూసుకుపోతున్న గుజరాత్ టైటాన్స్
  • నిన్న రాజస్థాన్ రాయల్స్ ను చిత్తు చేసిన వైనం
  • అంతకు ముందు మ్యాచ్ లో జట్టును గెలిపించలేకపోయిన పాండ్యా
ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో గుజరాత్ టైటాన్స్ హవా కొనసాగుతోంది. ఇప్పటి వరకు 10 మ్యాచ్ లు ఆడిన గుజరాత్ జట్టు 7 మ్యాచ్ లలో విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్ర స్థానంలో ఉంది.  నిన్న జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ ను చిత్తు చేసింది. రాజస్థాన్ నిర్దేశించిన 119 పరుగుల టార్గెట్ ను కేవలం 13.5 ఓవర్లలో ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ పాండ్యా కేవలం 15 బంతుల్లో 3 సిక్స్ లు, 3 ఫోర్ల సాయంతో 39 పరుగులు చేశాడు. అయితే అంతకు ముందు ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో పాండ్యా చివరి వరకు క్రీజ్ లో ఉన్నప్పటికీ తన జట్టును గెలిపించలేకపోయాడు. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో, పాండ్యా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

గత మ్యాచ్ లో కొన్ని నిర్ణయాలు తీసుకోవడంలో పొరపాట్లు జరిగాయని... నిన్న జరిగిన మ్యాచ్ లో ఆ పొరపాట్లకు తావివ్వలేదని పాండ్యా చెప్పారు. తాను బ్యాటింగ్ కు వచ్చేసరికే సగం టార్గెట్ ను ఓపెనర్లు కొట్టేశారని అన్నాడు. తప్పులను అంగీకరించడానికి తాను ఎప్పుడూ సిగ్గుపడనని... తన సక్సెస్ వెనకున్న కారణం ఇదేనని చెప్పాడు. నిన్నటి మ్యాచ్ లో రషీద్ ఖాన్, నూర్ అహ్మద్ లు అద్భుతంగా బౌలింగ్ చేశారని కితాబునిచ్చాడు.
Hardhik Pandya
IPL

More Telugu News