KTR: బండి సంజయ్ ని జైల్లో వేయగానే పేపర్ లీక్ లు ఆగిపోయాయి: కేటీఆర్

KTR take a dig at Bandi Sanjay
  • వరంగల్ జిల్లాలో కేటీఆర్ పర్యటన
  • బండి సంజయ్ చిల్లరగాళ్లతో కలిసి టెన్త్ పేపర్ లీక్ చేశాడని విమర్శలు
  • విద్యార్థుల తల్లిదండ్రులను అయోమయంలోకి నెట్టాడని వ్యాఖ్యలు

వరంగల్ జిల్లా పర్యటన సందర్భంగా మంత్రి కేటీఆర్ రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ పై ధ్వజమెత్తారు. బండి సంజయ్ కొందరు చిల్లరగాళ్లతో కలిసి పదో తరగతి ప్రశ్నాపత్రం లీక్ చేయాలని చూశాడని విమర్శించారు. బండి సంజయ్ ని జైల్లో వేయగానే పేపర్ లీక్ లు ఆగాయని అన్నారు. 

బండి సంజయ్ తన చర్యల ద్వారా లక్షల మంది విద్యార్థుల తల్లిదండ్రులను గందరగోళంలోకి నెట్టాడని మండిపడ్డారు. బండి సంజయ్ బెయిల్ పై బయటకొస్తే సన్మానాలు చేసుకున్నారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. మతం, కులం పేరుతో కొట్టుకుచావాలని కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వెలిబుచ్చారు.

  • Loading...

More Telugu News