Nara Lokesh: ఆఖరికి పార్టీ కూడా ఆయనది కాదు: నారా లోకేశ్

  • పాణ్యం నియోజకవర్గంలో లోకేశ్ పాదయాత్ర
  • పెదపాడులో సభ
  • పాణ్యం పవర్ అదిరిపోయిందన్న లోకేశ్
  • జగన్ ఎందుకు వంగలేకపోతున్నాడో చెప్పిన టీడీపీ యువనేత
  • జగన్ కు ఓ శాపం ఉందని వెల్లడి
  • జబర్దస్త్ ని మించి కామెడీ చేస్తున్నారని వైసీపీ నేతలపై విమర్శలు
Lokesh slams CM Jagan and YCP leaders

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 90వ రోజు పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గంలో ఉత్సాహంగా సాగింది. పెద్దకొట్టాల నుంచి ప్రారంభమైన పాదయాత్ర... కె.మార్కాపురం, కర్నూలు హైవే రోడ్డు, ఎ.గోకులపాడు, సల్కాపురం, నెరవాడ, పెదపాడు మీదుగా కొనసాగింది. పాణ్యం నియోజకవర్గం పెదపాడులో నిర్వహించిన సభలో లోకేశ్ ప్రసంగించారు. 

పాణ్యం పవర్ అదిరిపోయింది!

పాణ్యం ప్రజల పంచ్ కి ప్యాలస్ పిల్లికి దిమ్మతిరిగిపోతుంది. ఎంతో చరిత్ర ఉన్న పాణికేశ్వర స్వామి పేరు మీదే పాణ్యం పేరు వచ్చింది. పాణ్యం నర్సరీలు జిల్లాలోనే ప్రత్యేక గుర్తింపు పొందాయి. కాల్వబుగ్గ శ్రీ రామేశ్వరస్వామి, లక్ష్మీపురం జగన్నాథ స్వామి, కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం ఉన్న నేల ఇది. పుణ్య భూమి పాణ్యంలో పాదయాత్ర చెయ్యడం నా అదృష్టం. యువగళం... మనగళం... ప్రజాబలం.

అందుకే జగన్ కు నడుం సహకరించడంలేదు!

ఎవరికో పుట్టిన బిడ్డకు తానే తండ్రి అంటాడు కంత్రి జగన్. ఆయన వంగలేడు కానీ ఎప్పుడో శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులకు మళ్ళీ శంకుస్థాపన చేస్తాడు. కడప స్టీల్ ప్లాంట్ కి రెండోసారి శంకుస్థాపన చెయ్యడానికి వెళ్ళినప్పుడు వంగలేకపోయాడు. పక్కన ఉన్న పూజారులు రాయి ఎత్తి పట్టుకుంటే కొబ్బరికాయ కొట్టాడు. ఇప్పుడు భోగాపురం ఎయిర్ పోర్ట్ కి మళ్లీ శంకుస్థాపన చెయ్యడానికి ఊపుకుంటూ వెళ్ళాడు. 

ఈసారి కొబ్బరికాయ కొట్టడానికి సెట్టింగ్ వేశాడు. ఐరన్ రాడ్స్ తో క్రికెట్ స్టంప్స్ మాదిరిగా ఒక సెట్టింగ్ వేసి కొట్టాడు. శంకుస్థాపన చేసే ప్రాజెక్టు ఏదీ జగన్ తెచ్చింది కాదు. అందుకే కొబ్బరికాయ కొట్టడానికి నడుం సహకరించడం లేదు. 

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు భోగాపురం ఎయిర్ పోర్ట్ కి వ్యతిరేకంగా పోరాటం చేశాడు. అధికారంలోకి రాగానే భూములు తిరిగి ఇస్తాం అన్నాడు. విశాఖ ఎయిర్ పోర్ట్ లో ఈగలు తోలుకుంటున్నారు, ఇక భోగాపురం ఎయిర్ పోర్ట్ ఎందుకు దండగ అన్నాడు. ఇప్పుడు మాట మార్చాడు, మడమ తిప్పాడు.

ఏ ప్రాజెక్టు తేలేడని కంత్రీ జగన్ కు శాపం

2026 నాటికి భోగాపురం ఎయిర్ పోర్ట్ లో డబుల్ డెక్కర్ విమానాలు దింపుతాడట. భోగాపురం ఎయిర్ పోర్ట్ కి భూమి సేకరించింది చంద్రబాబు గారు, శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించింది చంద్రబాబు గారు. ఇప్పుడు ఈ కంత్రి జగన్ మళ్లీ శంకుస్థాపన చేశాడు. 

కంత్రీ జగన్ కి ఒక శాపం ఉంది జీవితంలో సొంతగా ఏ ప్రాజెక్టు, కంపెనీ తీసుకురాలేడు. ఆఖరికి పార్టీ కూడా ఆయనది కాదు. వేరే వాళ్ళు పెట్టిన పార్టీకి ఈయన మళ్లీ రిబ్బన్ కట్ చేశాడు అంతే. నేను ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అదానీ డేటా సెంటర్ తీసుకొచ్చాను. భూమి కేటాయించాం. చంద్రబాబు గారు శంకుస్థాపన కూడా చేశారు. నాలుగేళ్లు ఆ ప్రాజెక్టు ముందుకు సాగకుండా అడ్డుకొని ఇప్పుడు మళ్లీ శంకుస్థాపన చేశాడు.

బాబాయి కేసులో అడ్డంగా బుక్కయిన జగన్

బాబాయ్ ని లేపేసిన అబ్బాయిలు అడ్డంగా బుక్కైపోయారు. వివేకా మర్డర్ కి ముందు రోజు, మర్డర్ జరిగిన రోజు నిందితులు అంతా ఫోన్ కాల్స్ మాట్లాడుకున్నారు. నిందితులు అంతా ఫోన్ కాల్స్ ఎందుకు మాట్లాడుకున్నారు అని వైసీపీ నేతల్ని అడిగితే జబర్దస్త్ స్కిట్స్ మించిన కామెడీ చేస్తున్నారు. 

వాళ్లంతా మీ ఇంట్లో కూర ఏంటి, మీ ఇంట్లో కూర ఏంటి అని చర్చించుకున్నారంట. ఎవరి ఇంట్లోనూ కూర బాలేదంట, అందుకే చివరిగా అవినాష్ రెడ్డి, కంత్రి జగన్ గారి ఇంట్లో కూర ఏంటో కనుక్కోవడానికి కాల్ చేశాడట. కూర లెక్కలు అన్ని సీబీఐ తేల్చేసింది. త్వరలో అందరూ కలిసి చంచల్ గూడాకి పోవడం ఖాయం.

ఆయనపేరు కరప్షన్ రాంభూపాల్ రెడ్డి!

పాణ్యంలో అభివృద్ధి గోరంత... అవినీతి కొండంత. ఆయన మాత్రం అపర కోటీశ్వరుడు అయ్యాడు. అందుకే ఆయన పేరు మార్చాను. ఆయన కాటసాని రాంభూపాల్ రెడ్డి కాదు కరప్షన్ రాంభూపాల్ రెడ్డి. జగన్నాథగట్టుని కేజిఎఫ్ గా మార్చేశాడు కరప్షన్ రాంభూపాల్ రెడ్డి. కేజిఎఫ్ అంటే ఏంటో తెలుసా? కర్నూలు గ్రావెల్ ఫీల్డ్. 

కరప్షన్ రాంభూపాల్ రెడ్డి ఎర్రమట్టి మాఫియా జగన్నాథగట్టు కొండని మాయం చేస్తుంది. 1.71 లక్షలు క్యూబిక్ మీటర్లు అక్రమంగా తవ్వారని మైనింగ్ అధికారులే తేల్చారు. రూ.9.15 కోట్లు ఫైన్ కట్టాలని నోటీసులు పంపారు. అధికారికంగానే రూ.9.15 కోట్లు అంటే ఇక అసలు దోపిడీ ఎంత అయ్యి ఉంటుందో లెక్కేసుకోండి. జర్నలిస్టులకు కేటాయించిన భూమిని కూడా కొట్టేశారు.  

వక్ఫ్ భూములను కూడా వదలలేదు కరప్షన్ రాంభూపాల్ రెడ్డి. ముజఫర్ నగర్ దగ్గర ఉన్న సర్వే నంబర్ 524లోని మసీదుకి చెందిన 2 ఎకరాల భూమిని కబ్జా చేసారు. భూమి కోసం కోర్టులో పోరాడుతున్న ముస్లిం పెద్దలను ఇంటికి పిలిచి బెదిరించాడు.

కల్లూరు సున్నంగుడి సమీపంలో సర్వే నంబర్ 182 లో రస్తా పోరంబోకు భూమి 4.30 ఎకరాల భూమి ఉంది. విలువ రూ.25 కోట్లు. ఈ భూమి కొట్టేయడానికి స్కెచ్ వేసాడు కరప్షన్ రాంభూపాల్ రెడ్డి. ఉలిందకొండ గ్రామంలోని రాఘ మయూరి వెంచర్స్ లో పార్క్ కోసం కేటాయించిన భూమిని ఎమ్మెల్యే తన భార్య పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. 

ఓర్వకల్లు మండలం పుడిచెర్ల, శకునాల, కొమ్ము చెరువుల్లో మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు ఎమ్మెల్యే కొడుకు నరసింహరెడ్డి. క్రషర్లు, మైన్స్ యజమానులను బెదిరించి కోట్లు కొట్టేస్తున్నాడు కరప్షన్ రాంభూపాల్ రెడ్డి. 

టీడీపీ వచ్చాక కర్నూలులో హైకోర్టు బెంచ్

జగన్ ఒక పక్క కర్నూలు న్యాయ రాజధాని అంటాడు. బుగ్గన బెంగుళూరు వెళ్లి విశాఖలో న్యాయ రాజధాని అంటాడు. సుప్రీం కోర్టులో అమరావతిలోనే హైకోర్టు అని అఫిడవిట్ వేశాడు. 

2024లో జిల్లా నుంచి టీడీపీకి 14 మంది ఎమ్మెల్యేలు... ఇద్దరు ఎంపీలను ఇవ్వండి... ఉమ్మడి కర్నూలు జిల్లాను పరిశ్రమలు, సాగునీటి ప్రాజెక్టులు తెచ్చి దేశంలోనే అభివృద్ధిలో నంబర్ - 1 జిల్లాగా తీర్చిదిద్దే బాధ్యత టీడీపీ తీసుకుంటుంది. టీడీపీ అధికారంలోకి రాగానే హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసి తీరుతాం. 


*పాదయాత్ర వివరాలు:*

*ఇప్పటి వరకు నడిచిన దూరం – 1162.2 కి.మీ.*

*ఈరోజు నడిచిన దూరం – 14.7 కి.మీ.*

*91వ రోజు (6-5-2023) యువగళం వివరాలు:*

*కర్నూలు అసెంబ్లీ నియోజక వర్గం*

సాయంత్రం

3.30 – కర్నూలు శివారు రేడియో స్టేషన్ వద్ద క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.

4.00 – కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశం. బళ్లారి చౌరస్తాలో స్థానికులతో మాటామంతీ.

4.35 – కర్నూలు అగ్రికల్చర్ మార్కెట్ యార్డు వద్ద క్రిస్టియన్లతో సమావేశం.

5.10 – కర్నూలు గూడెం వద్ద స్థానికులతో సమావేశం.

5.45 – కర్నూలు లేబర్ కాలనీలో స్థానికులతో సమావేశం.

6.00 – కర్నూలు అశోక్ నగర్ జంక్షన్ లో విద్యార్థుతో సమావేశం.

6.20 – కర్నూలు కార్ల్ మార్క్స్ నగర్ లో మైనారిటీలతో సమావేశం.

7.25 – కర్నూలు ప్రకాష్ నగర్ ఆర్చ్ వద్ద క్రిస్టియన్లతో సమావేశం.

8.00 – కర్నూలు ఎస్టీబిసి గ్రౌండ్ విడిది కేంద్రంలో బస.

*******


More Telugu News