Pathaan: 1971 తర్వాత బంగ్లాదేశ్ లో రిలీజవుతున్న తొలి హిందీ చిత్రం ఇదే!

Bollywood movie releases first time in Bangladesh after 1971
  • ఈ ఏడాది ఆరంభంలో విడుదలైన షారుఖ్ ఖాన్ పఠాన్ చిత్రం
  • ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్ల వసూళ్లు
  • మే 12న బంగ్లాదేశ్ లో రిలీజ్
  • పఠాన్ చిత్రం బంగ్లాదేశ్ లోనూ ఘనవిజయం సాధిస్తుందన్న డిస్ట్రిబ్యూటర్ డిసౌజా  
భారత్ పొరుగునే ఉన్న బంగ్లాదేశ్ లో 1971 తర్వాత ఇప్పటివరకు ఓ హిందీ చిత్రం రిలీజ్ కాలేదంటే ఆశ్చర్యం కలగకమానదు. ఇప్పుడా పరిస్థితి మారబోతోంది. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం పఠాన్ బంగ్లాదేశ్ లో రిలీజవుతుంది. 

ఈ ఏడాది ఆరంభంలో విడుదలై ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్లు కొల్లగొట్టిన పఠాన్... మే 12న బంగ్లాదేశ్ లో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. 52 ఏళ్ల తర్వాత బంగ్లాదేశ్ లో పఠాన్ రూపంలో ఓ బాలీవుడ్ చిత్రం సందడి చేయనుంది. 

ఇంటర్నేషనల్ ఫిలిం డిస్ట్రిబ్యూటర్ నెల్సన్ డిసౌజా దీనిపై స్పందించారు. దేశాలు, సంస్కృతుల మధ్య అంతరాలను తగ్గించగల శక్తి సినిమా మాధ్యమానికి ఉందని అన్నారు. పఠాన్ చిత్రం బంగ్లాదేశ్ లోనూ ఘనవిజయం సాధిస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు.
Pathaan
Bangladesh
Release
Sharukh Khan
Bollywood

More Telugu News