YS Jagan: వివేకా హత్య కేసులో సాక్షి యాజమాన్యాన్ని ప్రశ్నించాలి: రఘురామకృష్ణరాజు

Raghurama demands Sakshi owners grillingin viveka murder case
  • జనం బాధల్లో ఉన్న సమయంలో జగన్ ఇంట్లో, చంద్రబాబు జనంలో అని వ్యాఖ్య
  • మా ప్రభుత్వం విపరీతంగా అప్పులు చేస్తోందన్న ఎంపీ
  • పెళ్లి కానుకకు టెన్త్ పాస్ నిబంధన ఎందుకని ప్రశ్న
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సాక్షి మీడియా యాజమాన్యాన్ని ప్రశ్నించాలని ఎంపీ, వైసీపీ తిరుగుబాటు నేత రఘురామ కృష్ణరాజు శుక్రవారం డిమాండ్ చేశారు. ఈ కేసుకు సంబంధించి ఎంపీ సీటు అడిగినట్లు వైఎస్ షర్మిల స్ఫష్టంగా చెప్పారన్నారు. జనం ప్రస్తుతం బాధల్లో ఉన్నారని, ఇలాంటి సమయంలో జగన్ ఇంట్లో ఉంటే, ప్రతిపక్ష నేత చంద్రబాబు మాత్రం అదే జనాల్లో ఉన్నారని ప్రశంసించారు. మా ప్రభుత్వం (వైసీపీ ప్రభుత్వం) విపరీతంగా అప్పులు చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి వస్తున్న ఆదాయం ఏమవుతుందో అర్థం కావడం లేదన్నారు. పెళ్లి కానుక లేదా షాదీ తోఫాకు పదో తరగతి పాస్ నిబంధన ఏమిటో అర్థం కావడం లేదన్నారు.
YS Jagan
Raghu Rama Krishna Raju

More Telugu News