Ukraine: రష్యా ప్రతినిధిపై ఉక్రెయిన్ ఎంపీ పిడిగుద్దుల వర్షం.. వీడియో ఇదిగో!

  • ఉక్రెయిన్ జెండా లాక్కుని వెళ్లిన రష్యా ప్రతినిధి
  • వెంటబడి తరుముతూ దాడి చేసిన ఉక్రెయిన్ ఎంపీ
  • అంతర్జాతీయ వేదికపై ఘటన.. వైరల్ గా మారిన వీడియో
Ukraine MP Punches Russian Representative At Global Meet

టర్కీ రాజధాని అంకారాలో జరిగిన ఓ అంతర్జాతీయ కార్యక్రమంలో షాకింగ్ సంఘటన చోటుచేసుకుంది. తమ జాతీయ జెండా లాక్కుని వెళుతున్న రష్యా ప్రతినిధిపై ఉక్రెయిన్ ఎంపీ దాడి చేశారు. వెంటబడి తరుముతూ పిడిగుద్దులు కురిపించాడు. జాతీయ జెండాను తిరిగి తీసుకుంటూ.. మీలాంటి జంతువులు మా జెండాకు దూరంగా ఉండాలని హెచ్చరించాడు. ఇంతలో సెక్కూరిటీ సిబ్బంది వచ్చి ఇద్దరినీ అడ్డుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర ప్రారంభించి 14 నెలలు కావొస్తోంది. పరస్పర దాడులతో రెండు దేశాలు తీవ్రంగా నష్టపోయాయి. ప్రాణనష్టం కూడా విపరీతంగా ఉంది. తాజాగా క్రెమ్లిన్ పై ఉక్రెయిన్ దాడికి ప్రయత్నించిందంటూ రష్యా ఆరోపించింది. రెండు డ్రోన్లను కూల్చివేసిన దృశ్యాలను మీడియాకు విడుదల చేసింది. ఈ దాడికి ప్రతీకారదాడులు తప్పవంటూ రష్యా హెచ్చరించింది.

ఈ నేపథ్యంలో టర్కీలోని అంకారాలో జరుగుతున్న బ్లాక్ సీ ఎకనామిక్ కమ్యూనిటీ 61వ పార్లమెంటరీ సమావేశాలలో రష్యా, ఉక్రెయిన్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఉక్రెయిన్ ఎంపీ ఒలెక్సాండ్ర మారికోవస్కీ ఈ మీటింగ్ లో మాట్లాడుతుండగా రష్యా ప్రతినిధి వేదికపైకి వచ్చి ఉక్రెయిన్ జెండాను లాక్కుని వెళ్లాడు. దీంతో ఆయన వెంటపడ్డ మారికోవస్కీ.. రష్యా ప్రతినిధిపై దాడి చేశాడు. తమ జాతీయ పతాకాన్ని తిరిగి తీసుకున్నాడు. ఇంతలో సెక్యూరిటీ సిబ్బంది వచ్చి ఇద్దరినీ అడ్డుకున్నారు.

More Telugu News