Kanimozhi: కనిమొళికి సుప్రీంకోర్టులో భారీ ఊరట

  • తూత్తుకుడి నుంచి ఎంపీగా గెలుపొందిన కనిమొళి
  • ఆమె గెలుపును హైకోర్టులో సవాల్ చేసిన సంతాన కుమార్ అనే వ్యక్తి
  • కనిమొళికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను కొట్టివేసిన సుప్రీంకోర్టు
Kanimozhi gets relief in Supreme Court

తమిళనాడు సీఎం స్టాలిన్ సోదరి, డీఎంకే లోక్ సభ సభ్యురాలు కనిమొళికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. వివరాల్లోకి వెళ్తే, తూత్తుకుడి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఆమె ఎంపీగా గెలుపొందారు. అయితే, ఆమె గెలుపును సవాల్ చేస్తూ అదే నియోజకవర్గానికి చెందిన సంతాన కుమార్ అనే వ్యక్తి మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో కనిమొళి కూడా పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆమె పిటిషన్ ను హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో, ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఆమె గెలుపును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను కొట్టివేసింది. దీంతో, ఆమెకు భారీ ఊరట లభించింది.

More Telugu News