India: గోవా విందులో పాక్ విదేశాంగ మంత్రి భుట్టోతో కేంద్ర మంత్రి జై శంకర్ కరచాలనం!

  • గోవాలో నిన్న మొదలైన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశాలు 
  • 12 ఏళ్ల తర్వాత భారత్ లో పాకిస్థాన్ మంత్రి అధికారిక పర్యటన
  • వివిధ దేశాల ప్రతినిధులకు నిన్న రాత్రి విందు ఇచ్చిన విదేశీ మంత్రిత్వ శాఖ
Jaishankar Pakistans Bilawal Bhutto shook hands at Goa SCO dinner

గోవా వేదికగా జరుగుతున్న షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్ సీఓ) రెండు రోజుల సమావేశాలకు హాజరైన వివిధ దేశాల మంత్రులు, అధికారులకు గురువారం సాయంత్రం భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన విందులో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్.. పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీతో కరచాలనం చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ విషయాన్ని సమావేశానికి హాజరైన వర్గాలు తెలిపాయి. 

ఈ రోజు జరగనున్న ఎస్ సీఓ కౌన్సిల్ ఆఫ్ ఫారిన్ మినిస్టర్స్ సమావేశంలో పాల్గొనేందుకు బిలావల్ భుట్టో గురువారం గోవా చేరుకున్నారు. 2011లో హీనా రబ్బానీ ఖర్.. భారత మాజీ విదేశాంగ మంత్రి ఎస్ ఎం కృష్ణను కలిసిన తర్వాత పాక్ విదేశాంగ మంత్రి భారతదేశానికి రావడం ఇదే తొలిసారి. ఖర్ ప్రస్తుతం పాకిస్థాన్ విదేశాంగ శాఖ సహాయ మంత్రిగా పనిచేస్తున్నారు. డిసెంబరు 2016లో పాకిస్థాన్‌ విదేశాంగ సలహాదారు సర్తాజ్‌ అజీజ్‌ భారత్‌లో పర్యటించిన తర్వాత తొలిసారిగా జరుగుతున్న అత్యున్నత స్థాయి పర్యటన ఇదే కావడం విశేషం.

More Telugu News