KTR: వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సుకు కేటీఆర్‌కు ఆహ్వానం

World Economic Forum invites Minister KTR
  • జూన్ 27వ తేదీ నుండి 29వ తేదీ వరకు చైనాలోని టియాంజిన్ వేదికగా సదస్సు
  • హాజ‌రు కావాల‌ని కేటీఆర్‌కు డ‌బ్ల్యూఈఎఫ్ అధ్య‌క్షుడి ఆహ్వానం
  • తెలంగాణ ప్రభుత్వంపై ప్రశంసలు
వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సుకు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు ఆహ్వానం అందింది. జూన్ 27వ తేదీ నుండి 29వ తేదీ వరకు చైనాలో సదస్సు నిర్వహిస్తున్నారు. వచ్చే నెలాఖరులో జరగనున్న ప్ర‌పంచ ఆర్థిక వేదిక వార్షిక స‌ద‌స్సు చైనాలోని టియాంజిన్ వేదికగా జరగనుంది. ఈ సదస్సుకు హాజ‌రు కావాల‌ని కేటీఆర్‌కు డ‌బ్ల్యూఈఎఫ్ అధ్య‌క్షుడు బోర్గె బ్రెండే ఆహ్వానం పంపించారు. కొత్త ప్ర‌ణాళిక‌లు, సాంకేతిక‌త‌తో తెలంగాణ దూసుకెళ్తోంద‌ని బోర్గె ఈ సందర్భంగా ప్రశంసల వ‌ర్షం కురిపించారు.
KTR
Telangana

More Telugu News