హైదరాబాద్ టీసీఎస్ కంపెనీకి బాంబు బెదిరింపు

Bomb threat call to Hyderabad tcs
  • బాంబు బెదిరింపు కాల్ రావడంతో ఉద్యోగులను ఖాళీ చేయించిన సంస్థ
  • సమాచారం అందడంతో బాంబు స్క్వాడ్‌తో పోలీసుల తనిఖీ
  • ఎలాంటి బాంబు లేదని గుర్తింపు
  • బెదిరింపు కాల్ చేసింది సెక్యూరిటీ విభాగం మాజీ ఉద్యోగిగా గుర్తింపు
హైదరాబాద్ మాదాపూర్ లోని టీసీఎస్ సంస్థకు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. కంపెనీలో బాంబు పెట్టినట్లు కాల్ రావడంతో అప్రమత్తమైన యాజమాన్యం వెంటనే ఉద్యోగులను ఖాళీ చేయించింది. సమాచారాన్ని మాదాపూర్ పోలీసులకు అందించింది. పోలీసులు బాంబు స్క్వాడ్ తో టీసీఎస్ కంపెనీలో తనిఖీలు చేపట్టారు. ఎలాంటి బాంబు లేదని గుర్తించి ఊపిరి పీల్చుకున్నారు. బాంబు బెదిరింపు కాల్ చేసిన వ్యక్తిని గుర్తించారు. అతను సెక్యూరిటీ విభాగంలో పని చేసిన మాజీ ఉద్యోగిగా గుర్తించారు. అతనిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
Go Back to Shorts
tcs
Hyderabad

More Telugu News