Bonda Uma: రాజ శ్యామల యాగం చేసే అర్హత జగన్‌కి లేదు: బొండా ఉమ

  • జగన్ మళ్లీ సీఎం కావడం కోసమే యాగం చేస్తున్నారన్న బొండా ఉమ
  • టీటీడీ నుంచి రెండున్నర కోట్లు తీసుకున్నారని ఆరోపణ
  • హిందూ మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరిస్తున్నారని విమర్శ
TDP Leader bonda uma fires on CM Jagan

రాజ శ్యామల యాగం చేసే అర్హత ముఖ్యమంత్రి జగన్‌కి లేదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. హిందూ మతాన్ని నమ్మేవారే ఆ యాగం చేయాలని పేర్కొన్నారు. జగన్ రెండోసారి ముఖ్యమంత్రి కావటానికి ప్రజల డబ్బుతో రాజ శ్యామల యాగం చేయటం విడ్డూరమన్నారు. వైసీపీ నేతలు తమ సొంత డబ్బుతో యాగం చేసుకోవాలన్నారు.

జగన్ నేలమాళిగల్లో దాచిన డబ్బుని బయటికి తీసి మళ్లీ ముఖ్యమంత్రి అవ్వాలని చూస్తున్నారని బొండా ఉమ ఆరోపించారు. జగన్ అవినీతితో సంపాదించిన డబ్బుతో రాజ శ్యామల యాగం చేసుకోవాలని, రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన దేవాలయాలకు సంబంధించిన డబ్బుతో రాజశ్యామల యాగం చేస్తున్నారని ఆరోపించారు. 

తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి రెండున్నర కోట్లు తీసుకున్నారని బొండా ఉమ అన్నారు. ‘‘జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని లూటీ చేశారు. రాష్ట్రాన్ని దోచుకు తినడానికి, ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేయడానికి ఆయనకు అధికారం ఎవరు ఇచ్చారు?’’ అని ప్రశ్నించారు. దేవాలయాల నుంచి తెప్పించుకున్న డబ్బును వెంటనే వెనక్కి జమ చేయాలని డిమాండ్ చేశారు. హిందూ మనోభావాలు దెబ్బతినేలా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

సిట్ వ్యవహారంపై కొంత మంది పుడింగులు బయటకు వచ్చి మాట్లాడుతున్నారని, వీళ్లు నాలుగేళ్ల నుంచి ఏం చేశారని బొండా ఉమ ప్రశ్నించారు. ఒక్క కేసులో కూడా చార్జిషీట్ వేయలేదన్నారు. రేపో ఎల్లుండో ఎంపీ అవినాశ్ రెడ్డి అరెస్ట్ ఖాయమని జోస్యం చెప్పారు. 50 మంది వైసీపీ ఎమ్మెల్యేలు సీట్లు వద్దంటున్నారన్నారు. ఎమ్మెల్యేలు పారిపోతున్నారని, సమన్వయకర్తలు కాడి వదిలేస్తున్నారని చెప్పారు.

More Telugu News