ఆగ్నేయ బంగాళాఖాతంలో 'మోచా' తుపాను
- బంగాళాఖాతంలో తుపాను ఏర్పడేందుకు అనుకూలత
- మే 6న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం
- తుపానుగా మారితే 'మోచా' అని నామకరణం
- 'మోచా' అనే పేరును సూచించిన యెమెన్ దేశం
- అల్పపీడనం ఏర్పడ్డాక దీని గమనంపై స్పష్టత
- మయన్మార్ వైపు వెళుతుందని ప్రైవేటు వాతావరణ సంస్థల అంచనా
తుపానుగా మారితే దీనిని 'మోచా' అని పిలుస్తారని ఐఎండీ తెలిపింది. ఈ పేరును యెమెన్ దేశం సూచించినట్టు వెల్లడించింది. యెమెన్ లోని ఓ ఓడరేవు నగరం పేరు మీదుగా 'మోచా' అని నామకరణం చేసినట్టు వివరించింది.
భారత్ లోని తూర్పు తీర రాష్ట్రాలకు దీని వల్ల ముప్పు ఉందని చెబుతున్నప్పటికీ, ప్రస్తుతానికి ఈ తుపానుపై ఐఎండీ వద్ద కూడా స్పష్టమైన సమాచారం లేదు. అల్పపీడనం ఏర్పడ్డాక దీని గమనంపై ఓ అంచనాకు రానున్నారు.
కాగా, మోచా తుపాను ఈశాన్య దిశగా పయనించి మయన్మార్ తీరాన్ని తాకే అవకాశాలున్నాయని ఓ ప్రైవేటు వాతావరణ సంస్థ మోడల్స్ సూచిస్తున్నాయి.