Amazon: అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ ప్రారంభం.. ఫోన్లపై ఆకర్షణీయమైన ఆఫర్లు

Amazon Great Indian Summer sale goes live for Prime members Top deals on iPhones OnePlus and other smartphones
  • ఈ నెల 8 వరకు కొనసాగనున్న ప్రత్యేక విక్రయాలు
  • ఐసీఐసీఐ, కోటక్ కార్డులపై 10 శాతం వరకు డిస్కౌంట్
  • నేడు ప్రైమ్ సభ్యులకు అదనంగా రూ.250 డిస్కౌంట్
అమెజాన్ లో ఏటా పెద్ద ఎత్తున నడిచే గ్రేట్ ఇండియన్ సమ్మర్ సేల్ (వేసవి ప్రత్యేక విక్రయాలు) కార్యక్రమం ప్రారంభమైంది. 8వ తేదీ వరకు ఈ ప్రత్యేక డిస్కౌంట్ సేల్ కొనసాగనుంది. 4వ తేదీన ప్రైమ్ సభ్యులకు అదనపు డిస్కౌంట్ డీల్స్ ఉంటాయి. ఈ సమ్మర్ సేల్ లో భాగంగా పలు రకాల ఫోన్లపై ఆకర్షణీమైన డీల్స్ ను అమెజాన్ ప్రకటించింది. 

ఐఫోన్ 14 128జీబీ వేరియంట్ అసలు ధర రూ.79,900. ఆఫర్ లో భాగంగా దీన్ని రూ.66,900కు సొంతం చేసుకోవచ్చు. దీనికి అదనంగా ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు చెల్లింపులపై మరో 10 శాతం డిస్కౌంట్ కూడా ఉంది. పాత ఫోన్ ఎక్చేంజ్ పై ఇంకా తక్కువకే కొనుగోలు చేసుకోవచ్చు. ఐఫోన్ 14 ప్లస్ ధర రూ.89,900. అది ఇప్పుడు రూ.75,900గా ఉంది. ఐసీఐసీఐ బ్యాంక్ కార్డుపై రూ.1,000 తగ్గింపు లభిస్తుంది. 

వన్ ప్లస్ నార్డ్ సీఈ 2 లైట్ విక్రయ ధర రూ.18,499. దీనిపై రూ.1,000 డిస్కౌంట్ లభిస్తుంది. దీనికి కొంచెం అదనంగా జోడిస్తే నార్డ్ సీఈ 2 లైట్ కొనుగోలు చేసుకోవచ్చు. నార్డ్ సీఈ 2 ధర రూ.19,999. డిస్కౌంట్ పై రూ.19,000కు సొంతం చేసుకోవచ్చు. వన్ ప్లస్ 11ఆర్ ను రూ.39,998కి విక్రయిస్తుండగా, ఐసీఐసీఐ కార్డుపై ఇది రూ.38,999కు లభిస్తుంది. దాదాపు అన్ని ఉత్పత్తులపై ఆకర్షణీయమైన డీల్స్ ఉన్నాయి.
Amazon
Great Indian Summer sale
Top deals
discounts
smart phones

More Telugu News