britain: డబ్బు కోసం వృద్ధుడి మృతదేహాన్ని రెండేళ్ల పాటు ఫ్రీజర్ లోనే ఉంచిన వ్యక్తి!

  • వృద్ధుడి పెన్షన్ కాజేసేందుకు ఓ వ్యక్తి ప్లాన్
  • విషయం బయటపడడంతో కేసు పెట్టిన పోలీసులు
  • బర్మింగ్ హామ్ డౌన్ టౌన్ లో దారుణం
UK Man Kept A Pensioners Body In Freezer And Used His Money For Shopping

పొరుగింట్లో ఉంటున్న ఓ వృద్ధుడు చనిపోతే.. ఆ మృతదేహాన్ని ఫ్రీజర్ లో పెట్టాడో ఓ ప్రబుద్ధుడు. దాదాపు రెండేళ్ల పాటు ఫ్రీజర్ లోనే ఉంచిన విషయం బయటపడడంతో పోలీసులు కేసు పెట్టారు. గౌరవప్రదంగా అంత్యక్రియలు జరగకుండా అడ్డుకున్నాడని ఆరోపిస్తూ నిందితుడిని జైలుకు పంపారు. తాజాగా ఈ కేసులో మరో సంచలన విషయం బయటపడింది. వృద్ధుడి పెన్షన్ కోసమే నిందితుడు ఈ పని చేశాడని తేలింది. దీంతో పోలీసులు మరో కేసు నమోదు చేశారు.

బ్రిటన్ లోని బర్మింగ్ హామ్ సిటీలో చోటుచేసుకుందీ దారుణం.. బర్మింగ్ హామ్ డౌన్ టౌన్ క్లీవ్ లాండ్ టవర్ లో జాన్ వెయిన్ రైట్ (71) నివసించేవారు. పొరుగింట్లో డేమియన్ జాన్సన్ (52) తో స్నేహం పెంచుకున్నారు. ఈ క్రమంలో అనారోగ్య కారణాలతో 2018లో వెయిన్ రైట్ కన్నుమూశారు. వెయిన్ రైట్ కోసం వచ్చే బంధువులు ఎవరూ లేకపోవడంతో జాన్సన్ ఆయన మృతదేహాన్ని ఫ్రీజర్ లో పెట్టాడు. వెయిన్ రైట్ బతికే ఉన్నట్లు అందరినీ నమ్మిస్తూ ఆయనకు నెల నెలా వచ్చే పెన్షన్ కాజేశాడు.

ఆ సొమ్ముతో షాపింగ్ చేస్తూ, హాయిగా కాలం గడిపాడు. దాదాపు రెండేళ్ల పాటు వెయిన్ రైట్ మృతదేహం అలాగే ఫ్రీజర్ లోనే ఉంచేశాడు. 2020 ఆగస్టులో మృతదేహం విషయం బయటకు పొక్కడంతో పోలీసులు జాన్సన్ ను అరెస్టు చేశారు. పెన్షన్ కోసమే మృతదేహాన్ని ఫ్రీజర్ లో దాచాడన్న ఆరోపణలను జాన్సన్ కొట్టిపారేశాడు. వెయిన్ రైట్ తో తనకు జాయింట్ అకౌంట్ ఉందని, టెక్నికల్ గా ఆ ఖాతాలోని సొమ్ము మొత్తం తనకే చెందుతుందని వాదిస్తున్నాడు.

More Telugu News