రెండు నెలల క్రితం ఉగ్రవాదంలో చేరిన ఇద్దరు యువకులు.. ఎన్‌కౌంటర్‌లో హతం
- బారాముల్లా జిల్లాలో ఈ తెల్లవారుజామున ఘటన
- హతమైన ఇద్దరూ స్థానిక ఉగ్రవాదులుగా గుర్తింపు
- ఈ ఏడాది మార్చిలోనే లష్కరేలో చేరిన వైనం
వీరిద్దరూ లష్కరే తోయిబాకు చెందిన స్థానిక ఉగ్రవాదులని పోలీసులు తెలిపారు. వారు ఈ ఏడాది మార్చిలోనే ఉగ్రవాదంలో చేరినట్టు పేర్కొన్నారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతున్నట్టు చెప్పారు. బారాముల్లా జిల్లాలోని వనీగామ్ పీయన్ క్రీరి ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నట్టు సమాచారం అందుకున్న భద్రతా దళాలు ఈ తెల్లవారుజామున గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో తారసపడిన ఉగ్రవాదులు తొలుత కాల్పులు ప్రారంభించారు. దీంతో అప్రమత్తమైన భద్రతా దళాలు తిప్పికొట్టాయి.